రజినీకాంత్ గొప్పదనానికి నిదర్శనమిదే.. అందుకే సూపర్ స్టార్ అయ్యాడు!!
సూపర్ స్టార్ రజినీకాంత్ సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శనం. ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ అయినప్పటికీ ఏనాడూ కూడా తన స్టార్డంను బయటకు ప్రదర్శించలేదు. బయటకు వస్తే మామూలు ప్రజలకు మల్లె.. సాదాసీదాగా కనిపిస్తుంటాడు. అలా ఉండటానికే రజినీ ఇష్టపడతాడు. స్క్రీన్‌పై కనిపించినప్పుడు మాత్రమే మేకప్ వేసుకుంటాడు. బయట తన సహజత్వాన్ని ప్రదర్శించేందుకు మొగ్గు చూపుతుంటాడు.

Rajinikanth Slept On floor For Aravind swami In Dalapathi
దళపతి షూటింగ్‌లో..
అలా రజినీకాంత్ సింప్లిసిటీకి ఉదహరణగా మారాడు. ఎంతటి స్టార్డం ఉన్నా కూడా ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌ను అంతే సమానంగా చూడటం అందరి వల్ల కాదు. కానీ సూపర్ స్టార్ రజినీ మాత్రం ఓసారి ఓ ఆర్టిస్ట్ కోసం నేల మీద పడుకున్నాడు. దళపతి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఈ ఘటనను అందరూ పదే పదే చెప్పుకుంటారు. దళపతి సినిమా సమయంలో రజినీ సూపర్ స్టార్. అందులో ఓ పాత్రను వేసిన అరవింద్ స్వామి అప్పటికి ఎవ్వరికీ తెలియదు.
రజినీ నేల మీద..
అలాంటి అరవింద్ స్వామి ఓ సారి షూటింగ్ అయిపోయాక.. ఓ రూంలోకి వెళ్లి సేదతీరాడు. అక్కడ సకలభోగాలతో సేద తీరేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉండటంతో బాగా నిద్రపోయాడు. కానీ తెల్లారే సరికి అదే రూంలో రజినీకాంత్ నేల మీద పడుకుని ఉన్నాడు. అలా రజినీ నేల మీద పడుకోవడం ఆశ్చర్యం, భయం వేసిన అరవింద్ స్వామి అసలు విషయం కనుక్కున్నాడట. వారు చెప్పిన విషయం విని అరవింద్ స్వామి ఖంగుతిన్నాడట.

Rajinikanth Slept On floor For Aravind swami In Dalapathi
అందుకే సూపర్ స్టార్..
రజినీకాంత్ కోసం ఏర్పాటు చేసిన రూంలో నువ్ పడుకున్నావ్.. బాగా నిద్రపోయి ఉన్నావ్.. అందుకే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అలా పడుకున్నారని రజినీ అసిస్టెంట్లు చెప్పారట. అదే రజినీ స్థానంలో వేరే హీరో ఉండుంటే అహం దెబ్బ తినేది. షూటింగ్ క్యాన్సిల్ అయ్యేది.. అరవింద్ స్వామి అడ్రస్ గల్లంతయ్యేదేమో. కానీ అక్కడున్నది రజినీకాంత్. అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. అలాంటి సూపర్ స్టార్ రజినీ బర్త్ డే నేడు (డిసెంబర్ 12). ఆయన ఇలాగే ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుందాం.