KCR : కేసీఆర్ రాజకీయ చతురత.. ఆ రెండు పార్టీలకు సమదూరం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : కేసీఆర్ రాజకీయ చతురత.. ఆ రెండు పార్టీలకు సమదూరం

 Authored By himanshi | The Telugu News | Updated on :22 February 2021,3:30 pm

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ చాణక్యుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సందర్భానుసారం రాజకీయం చేయడం రాజకీయ పండితులకు కూడా ఆశ్చర్యం ను కలిగిస్తుంది. అనూహ్యంగా ఉప ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ముందస్తు ఎన్నికలకు కాకుండా సాధారణ ఎన్నికలకు వెళ్లి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి అనేది రాజకీయ విశ్లేషకులు వాదన. రాజకీయంగా కేసీఆర్ వేసే ప్రతి అడుగు కూడా చాలా ముందస్తు ప్రణాళికతో ఉంటుంది అంటూ రాజకీయ వర్గాలు వారు అంటూ ఉంటారు. ఇప్పుడు మరో సారి కూడా కేసీఆర్ అదే పని చేస్తున్నాడు. రెండు ప్రధాన జాతీయ పార్టీలకు కేసీఆర్ సమ దూరంను పాటిస్తూ వస్తున్నాడు.

బీజేపీ అధికారంలో ఉండటంతో రాష్ట్రములో ఎలా ఉన్నా కూడా జాతీయ నాయకులతో మాత్రం సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటాడు. అలాగే పలు సందర్భంలో కూడా కేసీఆర్ పార్లమెంట్ లో బీజేపీ కి మద్దతుగా నిలిచాడు. అలా అని కాంగ్రెస్ కు కేసీఆర్ పూర్తిగా దూరం అయ్యింది కూడా లేదు. అందుకే రెండు పార్టీల జాతీయ నాయకత్వం కూడా కేసీఆర్ విషయంలో పాజిటివ్ గానే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే వెంటనే అటు వైపు వెళ్లి మద్దతు ఇచ్చేందుకు ఏమాత్రం వెనుకాడడు.

Telangana CM KCR Profile

Telangana CM KCR Profile

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక వైపు రాష్ట్రములో రెండు పార్టీలతో సున్నం పెట్టుకున్నట్లుగా అనిపించినా కూడా జాతీయ స్థాయిలో మాత్రం అంతా బాగానే ఉందని, రాష్ట్రములో మరొకరికి ఛాన్స్ ఇవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో తాను అలా చేస్తున్నట్లుగా చెబుతున్నాడు. మొత్తానికి ఈయన చేస్తున్న రాజకీయం అందరికి కూడా ఆదర్శం గా ఉంది. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ అచ్చు కేసీఆర్ ను ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. అందుకే కేసీఆర్ ను రాజకీయ చాణక్యుడు అంటూ ప్రశంసలు కురిపించే వారు ఎంతో మంది ఉన్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది