Telangana mlc Election : తెలంగాణ లో ‘కుల’ ఎమ్మెల్సీ ప్రచారం..!
Telangana mlc Election : ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు కులాల పేరు చెప్పుకొని ఓట్లు రాబట్టుకోవాలని చూస్తుంటారు. అందుకే అక్కడి రాజకీయ పార్టీ లు సైతం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఏ కులం వారు ఉన్నారో అక్కడ ఆ కులం అభ్యర్థిని నిలబెడుతుంటారు. ఆలా నిలబెట్టి కులం పేరుతో ప్రచారం చేసి గెలుపు బాట పడతారు. ఇది తెలంగాణ కు కూడా పాకింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. కానీ ఎప్పుడు కూడా కుల ప్రస్తావన తీసుకురాలేదు. కులం పేరు చెప్పి ఓట్లు రాబట్టుకోలేదు. కానీ మొదటిసారి ఇప్పుడు కులం పేరు చెప్పుకొని ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో తెరాస vs బిజెపి గా మారింది. గ్రేటర్ తో పాటు దుబ్బాక ఎన్నికల్లో తెరాస కు బిజెపి పార్టీ పెద్ద షాక్ ఇవ్వడం తో తెరాస నేతలు..ఇప్పుడు బిజెపి పార్టీ ని టార్గెట్ గా పెట్టుకున్నారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో బిజెపి హావ ఎక్కువైంది. పలువురు ఇతర పార్టీ నేతలు సైతం బిజెపి తీర్థం పుచ్చుకోవడం..రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లోనూ కమలం హావ చూపించడం తో ప్రజల్లోని బిజెపి ఫై నమ్మకం మొదలైంది. ఈ నమ్మకాన్ని మరింత నిలబెట్టుకునేందుకు బిజెపి నేతలు ఇంకాస్త గట్టిగ కష్టపడుతున్నారు. రాష్ట్రంలో మరో నాల్గు రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో అన్ని పార్టీ లు ఆ ఎన్నికల ఫై దృష్టి సారించి ప్రచారం చేస్తున్నారు.

telangana parties
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి టీఆర్ఎస్ తరుపున పీవీ కుమార్తె సురభి వాణిదేవిని పోటీ చేస్తుండగా..బీజేపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య కులం యుద్ధం మొదలైంది. తెరాస సర్కార్ కుట్ర పూరితంగా బ్రాహ్మిణ్ అభ్యర్థిని రంగంలోకి దింపి.. ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తోందని… బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావు టీఆర్ఎస్‌పై విరుచుకుపడడం తో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. నెటిజలన్లతో పాటు రాజకీయ నేతలు సైతం కులం ప్రచారం చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవాలని బీజేపీ , తెరాస పార్టీ లు సన్నాహాలు చేస్తూ..కులం ఓట్ల కోసం పాకులాడుతున్నారు. మరి ప్రజలు కులం చూస్తారో..లేక ప్రజా శేయస్సు చూస్తారో చూడాలి.