Post Office Schemes : ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల్లో రూ. 14 లక్షల రిటర్న్ పక్కా..
Post Office Schemes: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించడానికి పోస్టాఫిస్‌లలో ప్రత్యేక స్కీములు అమలు చేస్తున్నారు. గ్యారంటీ రిటర్న్‌తో ఆర్థిక భద్రత కల్పిస్తున్నారు. అలాగే ఆదాయం అందిస్తున్నారు. సీనియర్ సిటిజన్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే 5 సంవత్సరాలలో 14 లక్షల వరకు రిటర్న్ ఆదాయం పొందవచ్చు. అయితే పోస్టల్ డిపార్ట్ మెంట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా ప్రయోజనాలున్నాయి.పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుబడి పెడితే ఎలాంటి రిస్క్ లేకుండా రిటర్న్ పొందవచ్చు. స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి చాలా రిస్క్‌తో కూడిన పెట్టుబడులు. కాగా ఈ పథకం పేరు పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్.
ఇందులో పెట్టుబడి పెడితే మంచి ఆదాయం అందుకోవచ్చు.అయితే పెట్టుబడి పెట్టడానికి వయస్సు 60 ఏళ్లు పైబడి ఉండాలి. ఈ పథకం కింద 7.4 శాతం వడ్డీ పొందవచ్చు. కాగా ఈ పథకంలో పెట్టుబడిదారుడు కనీసం ఒక వేయి రూపాయలు, గరిష్ఠంగా 5 వేల రూపాయలు పెట్టుబడి చేయవచ్చు. ఇలా 5 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయవచ్చు. వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఉన్న వాళ్లు కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ఈ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆదాయపు పన్ను సెక్షన్ 80 c కింద మినహాయింపు కూడా పొందవచ్చు.సీనియర్ సిటిజన్ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 5 సంవత్సరాలలో 14 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.
Post Office Schemes: మూడేండ్లు పొడగించుకునే వీలు..
ఈ పథకంలో ఒకేసారి రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే 5 సంవత్సరాల తర్వాత 7.4 శాతం చక్రవడ్డీపై రూ.14,28,964 తిరిగి పొందే అవశం ఉంది. అలాగే ఇదే పెట్టుబడిని మరో 3 సంవత్సరాలు పొడగించుకునే వీలుంది. పైగా మెచ్మూరిటీ కి ముందే అకౌంట్‌ను క్లోజ్ చేయడానికి వీలుంది. అయితే సంవత్సరం తర్వాత మాత్రమే ఖాతాను క్లోజ్ చేస్తే డిపాజిట్ మొత్త్ంలో 1.5 శాతం నష్టపోతారు. అలాగే రెండు సంవత్సాల తర్వాత క్లోజ్ చేస్తే 1 శాతం మొత్తం నష్టపోయే అవకాశం ఉంది.