Junior NTR : చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ మౌనం వెనుక అసలు కారణం ఇదేనా?
Junior NTR : నారాచంద్రబాబు నాయుడు.. సీనియర్ ఎన్టీఆర్ అల్లుడిగానే కాదు.. తెలుగు రాజకీయాల్లో తనకంటూ కొన్ని పేజీలను రాసుకున్నారు. తెలుగు రాజకీయ చరిత్రలో ఆయనకు కొన్ని పేజీలు ఉంటాయి. దాదాపు 45 ఏళ్ల రాజకీయ చరిత్ర. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. తన రాజకీయ జీవితంలో తెలుగు జాతి అభివృద్ధి కోసం ఎంతో చేశారు. అయితే.. నారా చంద్రబాబు నాయుడులో రెండు కోణాలు ఉన్నాయి. నాణేనికి రెండు వైపులు ఉన్నట్టుగానే రాజకీయాల్లో చంద్రబాబుకు రెండు కోణాలు ఉన్నాయి. అందులో ఒకటి టీడీపీ పార్టీని లాక్కొని తన పార్టీగా చేసుకొని తనే ఆ పార్టీకి అధ్యక్షుడు అయి సీనియర్ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడం.
మరోవైపు తెలుగు జాతి కోసం ఒక రాజకీయ నాయకుడిగా ఆయన చేసిన సేవలు మాత్రం అనిర్వచనీయం. హైదరాబాద్ లో ఐటీ డెవలప్ మెంట్ కి ముఖ్య కారణం చంద్రబాబు అనే చెప్పుకోవాలి. నిజానికి.. టీడీపీ పార్టీ అనేది సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన పార్టీ. కానీ.. దాన్ని సీనియర్ ఎన్టీఆర్ చేతుల్లో నుంచి తీసుకొని ఆ పార్టీని లాక్కొని సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీని కూడా ఆ పార్టీకి దూరం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి జైలులో ప్రస్తుతం చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు జైలులో ఉండటంతో నందమూరి, నారా కుటుంబ సభ్యులు అందరూ వెంటనే రోడ్డు మీదికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు భార్య, కోడలు, కొడుకు లోకేష్ అందరూ రాజమండ్రి జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించి వచ్చారు.
Junior NTR : అందరూ వెళ్లినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వెళ్లలేదు
ఇప్పటి వరకు అందరు నందమూరి కుటుంబ సభ్యులు వెళ్లినా కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేదు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు తన అన్న కళ్యాణ్ రామ్ కూడా చంద్రబాబును చూడటానికి వెళ్లలేదు. అయితే.. జూనియర్ ఇలా దూరంగా ఉండటం ఇదే మొదటిసారేమీ కాదు. ఇదివరకు చాలా సార్లు సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన, కుటుంబ సభ్యుల కార్యక్రమాల్లోనూ దూరంగా ఉంటున్నారు. నిజానికి 2009 ఎన్నికల్లో చంద్రబాబు కోసం, టీడీపీ కోసం జూనియర్ ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు.పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డారు. చివరకు చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు. కానీ.. ఆ తర్వాత తన కొడుకు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు పక్కన పెట్టారు. అప్పటి నుంచి టీడీపీ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు ఎన్టీఆర్. కనీసం తాత సీనియర్ ఎన్టీఆర్ కు గౌరవార్థం స్మారక నాణేన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి నందమూరి కుటుంబ సభ్యులకు అందరికీ ఆహ్వానం అందితే.. అందరూ వెళ్లారు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వెళ్లలేదు.
అంతకుముందు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనలేదు. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు.. బాలకృష్ణకు కూడా జూనియర్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల తన అక్క సుహాసిని ఇంట్లో పెళ్లి జరిగితే ఏదో అలా వెళ్లి ఇలా వచ్చారు కానీ.. అక్కడ ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడలేదు. అయితే.. టీడీపీ కార్యక్రమాల్లో, రాజకీయాల్లో, చంద్రబాబు విషయంలో పట్టించుకోవద్దని జూనియర్ ఎన్టీఆర్ భావించినట్టు తెలుస్తోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ 2009 నుంచి ఇప్పటి వరకు టీడీపీకి చెందిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై కూడా జూనియర్ సైలెంట్ అయ్యారు. చంద్రబాబు విషయంలో చాలామంది రెస్పాండ్ అయినా జూనియర్ మాత్రం అస్సలు రెస్పాండ్ కాలేదు. ఒక ట్వీట్ వేయలేదు. కనీసం రాజమండ్రి జైలుకు కూడా వెళ్లలేదు. ప్రస్తుతం దేవర షూటింగ్ లో జూనియర్ బిజీగా ఉన్నారని వార్తలు వస్తున్నా.. కావాలనే జూనియర్ ఎన్టీఆర్.. టీడీపీ విషయంలో, చంద్రబాబు విషయంలో జోక్యం చేసుకోవడం లేదని అంటున్నారు.