Chicken Joints Biryani Recipe : మన రెస్టారెంట్ లో ట్రెండ్ అవుతున్న జాయింట్స్ బిర్యాని…!
Chicken Joints Biryani Recipe : మనం ఎక్కువగా రెస్టారెంట్లలో చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ ,వెజ్ బిర్యానీ, పనీర్ బిర్యానీ ఇలా తింటూ ఉంటాం. అయితే ప్రస్తుతం రెస్టారెంట్లలో ట్రెండీగా మారిన బిర్యాని మాత్రం జాయింట్స్ బిర్యాని. ఇప్పుడు జాయింట్స్ బిర్యాని రెస్టారెంట్లలో బాగా ట్రెండీగా అవుతుంది. అలాంటి ట్రెండీ బిర్యానీని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం… దీనికి కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం, చికెన్ జాయింట్స్, కారం, ఉప్పు, ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కరివేపాకు, పెరుగు, కాన్ ఫ్లోర్, మైదా, ఆయిల్, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, బండ పువ్వు ,దాల్చిన చెక్క సాజీర బిర్యాని ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీడిపప్పులు, పసుపు, గరం మసాల, నీళ్లు, పుదీనా, మొదలైనవి…
దీని తయారీ విధానం : ముందుగా రెండు కప్పుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్ ,కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం మిరియాల పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు కూడా వేసి బాగా కలిపి ముందుగా మనం గాట్లు పెట్టుకున్న చికెన్ జాయింట్స్ ని తీసుకొని దాంట్లో బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక బౌల్ పెట్టి దాంట్లో నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో జాయింట్స్ ని అన్ని వేసి బాగా ఎర్రగా అయ్యేవరకు రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో నాలుగు లవంగాలు నాలుగు యాలకులు ఒక దాల్చిన చెక్క అనాసపువ్వు ,బండ పువ్వు, నల్లయాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసి ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం షాజీరా అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
తర్వాత దీనిలో పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత దీనిలో జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం కరివేపాకు వేసి వేయించిన తర్వాత ఐదు కప్పుల నీటిని వేసి బాగా మసాల తాగనివ్వాలి. అలా మసలు కాగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి 80% ఉడికించుకోవాలి. అలా 80% ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న జాయింట్స్ ని అన్ని దాన్లో పెట్టేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం మిరియాల పొడి చల్లుకొని మళ్ళీ ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. అలా బాగా అర్ధమైన బిర్యాని రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత సో చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా రెస్టారెంట్లో ఫేమస్ అవుతున్న జాయింట్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు.