Christmas Festival : క్రిస్మస్ పండుగకి తప్పకుండా కేక్ కావాలి కదా.. అయితే ఇంట్లోనే ఎంతో ఈజీగా ఐదు రకాల కేక్ లు చేసుకుందాం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Christmas Festival : క్రిస్మస్ పండుగకి తప్పకుండా కేక్ కావాలి కదా.. అయితే ఇంట్లోనే ఎంతో ఈజీగా ఐదు రకాల కేక్ లు చేసుకుందాం..!

Christmas Festival : కేక్ అంటే ఎక్కువగా పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా కొన్ని వేడుకలకు కూడా కేక్లను కట్ చేస్తూ ఎంతో సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే క్రిస్మస్ కి కూడా ఎక్కువగా కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ కి కేక్ తప్పకుండా కావాలి. అందుకే ఇప్పుడు మనం ఐదు రకాల కేకుల్ని చేసుకోబోతున్నాం ఇంట్లోనే ఎంతో ఈజీగా.. ఇక మనకి ఈ సంవత్సరం ముగిసే టైం దగ్గరికి వచ్చింది. ఈ చివర్లో క్రిస్మస్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 December 2022,7:00 am

Christmas Festival : కేక్ అంటే ఎక్కువగా పుట్టినరోజు, పెళ్లిరోజు ఇలా కొన్ని వేడుకలకు కూడా కేక్లను కట్ చేస్తూ ఎంతో సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే క్రిస్మస్ కి కూడా ఎక్కువగా కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ కి కేక్ తప్పకుండా కావాలి. అందుకే ఇప్పుడు మనం ఐదు రకాల కేకుల్ని చేసుకోబోతున్నాం ఇంట్లోనే ఎంతో ఈజీగా.. ఇక మనకి ఈ సంవత్సరం ముగిసే టైం దగ్గరికి వచ్చింది. ఈ చివర్లో క్రిస్మస్ పండగని బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. క్రిస్మస్ అంటేనే కేకులు, స్నాక్ లు, వేడుకలు ఆత్మీయ కలయికలు కాబట్టి కేక్ లేకుండా కష్టమే కదా.. కేకులు కొనిగో లు చేసే ప్లాన్లో ఉన్నారా అయితే ఆగిపొండి. ఎందుకనగా ఎంతో ఈజీగా అతి తక్కువ ఖర్చుతో

తయారు చేసుకోగల కేకులు ఇప్పుడు మనం తయారు చేయబోతున్నాం.. ఈ కేకులు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం..1) చాక్లెట్ బనానా కేక్ : బనానా చాక్లెట్ కేక్ తయారు చేయడానికి చాలా సమయం. ఇంకా చాలా పదార్థాలు అవసరమే అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు అనుకున్నంత సమయం పట్టదు. ఈ కేక్ సింపుల్గా చేసుకోవచ్చు. వేరుశనగల వెన్న అరటిపండు కోకో పౌడర్ పదార్థాలను వినియోగించి నోరూరించే చాక్లెట్ బనానా కేక్ ని తయారు చేసుకోవచ్చు. 2) వైట్ చాక్లెట్ చీజ్ : వైట్ చాక్లెట్ చీజ్ కేక్ దాని రుచి మృదువైన, ఆకృతి ఎంతో గొప్పగా ఉంటుంది చీజ్ కేక్ లో చాలా రకాలు ఉంటాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ తో కేక్ ని తయారు చేసుకోవచ్చు..

christmas festival special foods on Five types of cakes

christmas festival special foods on Five types of cakes

3) మార్బుల్ కేక్ : మెల్ట్ ఇన్ దీ మౌత్ అనేలా ఉండే ఈ మార్బుల్ కేక్ మీ నాలిక రుచిని పెరిగేలా చేస్తుంది. దీనిని వెనిలా కోకో చాక్లెట్ ఫ్లేవర్లను వాడి తయారుచేస్తారు. దీనికి ఎగ్స్ అవసరం ఉండదు. ఈ కేక్ ని భోజనం తర్వాత తినడానికి చాలా బాగుంటుంది.

4) రిచ్ చాక్లెట్ కేక్ : చాక్లెట్ కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ముఖ్యంగా పిల్లలకు చాక్లెట్ కేకంటే చాలా ఇష్టం. ఈ క్రిస్మస్ వేల పిల్లల కోసం ఏమైనా కొత్తగా చేయాలి అని అనుకుంటే ఈ ఉత్తమమైన చాక్లెట్ కేక్ తయారు చేసి వాళ్ళని సంతోష పెట్టండి..

5) క్రిస్మస్ ప్లమ్ కేక్ : క్రిస్మస్ ప్లమ్ కేకుల మధ్య సంబంధం విడదీయరానిది.. ఈ కేకులు అనేవి క్రిస్మస్ వేడుకలలో చాలా ఫేమస్ అని చెప్పాలి. ఈ రుచికరమైన కేక్ ను ఆల్కహాల్తో లేదా ఆల్కహాల్ లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని డ్రైనట్స్, డ్రైఫ్రూట్స్ తో సహా ఇతర పదార్థాలతో తయారు చేయొచ్చు. దీని రుచి ఎంతో గొప్పగా ఉంటుంది. దీనిని అతి తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు…

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది