Fish Fry Recipe : తక్కువ ఆయిల్ తో చేపల వేపుడు ఇలా చేసి చూడండి…!
Fish Fry Recipe : చేపలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాని కొంతమంది చేపలు తినడానికి అసలు ఇష్టపడరు. ఎందుకంటే చేపలలో ముళ్ళు ఉంటాయని తినకుండా వదిలేస్తారు. అయితే చేపలను ఫ్రై లాగా చేసుకుని తింటే ముళ్ళు అస్సలు ఉండవు. ఈజీగా తినేయవచ్చు. చేపల వేపుడు ఇలా చేసుకున్నారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం చేపల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1) చేపలు 2) ఆయిల్ 3) పెరుగు 4) నిమ్మరసం 5) కార్న్ ఫ్లోర్ 6) శనగపిండి 7) ధనియాల పొడి 8) గరం మసాలా 9) ఉప్పు 10) పసుపు 11) కారం 12) జీలకర్ర పొడి 13) అల్లం వెల్లుల్లి పేస్ట్
తయారీ విధానం: ముందుగా ఈ ఫిష్ ఫ్రై కోసం పది చేప ముక్కలను తీసుకొని శుభ్రంగా ఉప్పుతో కడగాలి. తర్వాత ఇందులో 4-5 స్పూన్ల పుల్లటి పెరుగు, అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ పసుపు వేసి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. చేప ముక్కలను పుల్లటి పెరుగుతో కానీ మజ్జిగతో కానీ కలుపుకుంటే చేపలనేవి నీచు వాసన రావు. ఆ మూడింటిని చేప ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని నీళ్లు పోసి చేప ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వలన చేప ముక్కలు అస్సలు వాసన రావు. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, రుచికి తగ్గట్లుగా ఒకటిన్నర స్పూన్ కారం,

Fish Fry Recipe in Telugu
ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ఒకటిన్నర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక అర చెక్క నిమ్మరసాన్ని పిండుకొని తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ పిండిలో వేసుకొని మసాలాలు బాగా పట్టేలా ముక్కలను కలుపుకోవాలి. ఇలా ఒక పది నిమిషాల పాటు మసాలా ముక్కలకు పట్టేలా పట్టించాలి. ఇప్పుడు ఈ ముక్కలను ఒక గంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఒక గంట పాటు నానబెట్టిన తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ముక్కలను వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్ లో ఉంచి ముక్కలను వేయించుకోవాలి. ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోదు. అంతే రుచికరమైన చేపల వేపుడు రెడీ అయిపోయినట్లే.
