Karapusa Laddu Recipe : సన్న కారపూస లడ్డులు కరకరలాడుతూ భలే ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు…!!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karapusa Laddu Recipe : సన్న కారపూస లడ్డులు కరకరలాడుతూ భలే ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు…!!!

 Authored By prabhas | The Telugu News | Updated on :22 January 2023,7:40 am

Karapusa Laddu Recipe : ఈరోజు రెసిపీ వచ్చేసి సన్న కారపూస లడ్డు.. చాలా ఈజీ చేసుకోవచ్చు వీటిని పూసలడ్డులు అని కూడా అంటారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు.. ఇవి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజులు నిల్వ ఉంటాయి. ఇవి తినేటప్పుడు గట్టిగా లేకుండా మెత్తగా ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపించబోతున్నాను.. ఈ సన్నకారపూస లడ్డు ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం : దీనికి కావలసిన పదార్థాలు: శనగపిండి బెల్లం యాలకుల పొడి ఆయిల్, ఉప్పు బటర్ మొదలైనవి… దీని తయారీ విధానం: ముందుగా ఒక ఆఫ్ కేజీ సెనగపిండి తీసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలో వేసి కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ మనం మురుకులు ఒత్తుకోవడానికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి.

ఈ పిండిని కలిపిన తర్వాత ఈ పిండి ముద్దలుగా చేసుకుని మురుకుల గొట్టంలో పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకుని హీటెక్కిన తర్వాత ఈ మురుకుల గొట్టంలో పెట్టిన పిండితో ఈ మురుకులు ఆయిల్ లో ఒత్తుకోవాలి. ఇక మురుకులు ఒకవైపు కాలిన తర్వాత రెండోవైపు ఎర్రగా కాల్చి తీసుకోవాలి. పిండి మొత్తం కూడా అలాగే రెండు వైపులా ఎర్రగా కాల్చి తీసుకోవాలి. ఇక ఈ మురుకులని చల్లారిన తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక గిన్నెను పెట్టి ఏ కప్పుతో అయితే సెనగపిండిని తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం తీసుకొని కరిగించుకోవాలి.

How to make sanna Karapusa Laddu Recipe In Telugu

How to make sanna Karapusa Laddu Recipe In Telugu

బెల్లం కరిగిన తర్వాత దానిని వడకట్టి ఇంకొక పాన్ లో వేసి ఇది పాకం వచ్చేవరకు బాగా మరిగించుకుని ముద్ద పాకంల వచ్చిన తర్వాత దానిలో యాలకుల పొడి కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇక తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కారపూసలను వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. ఇక ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ కి నెయ్యి రాసి దానిలో వేసుకోవాలి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేతులకి నెయ్యి రాసుకొని ఉండల్లా చుట్టుకోవాలి. వీటిని గట్టిగా చుట్టుకోవద్దు. లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇది చల్లారిపోయి గట్టిగా అయితే దానిని మళ్లీ స్టవ్ పై పెట్టి కొద్దిసేపు వేడి చేసి వీటిని మరల చుట్టుకోవచ్చు. అంతేనండి సన్న కారపూస లడ్డు రెడీ ఇవి నెల రోజులువరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది