Nonstick Cooking : వామ్మో… నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేస్తున్నారా. ? అయితే ఈ ప్రమాదం తప్పదట..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nonstick Cooking : వామ్మో… నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేస్తున్నారా. ? అయితే ఈ ప్రమాదం తప్పదట..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 April 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Nonstick Cooking : వామ్మో... నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేస్తున్నారా. ? అయితే ఈ ప్రమాదం తప్పదట..!

Nonstick Cooking : ప్రస్తుతం అందరూ వంట చేయడానికి నాన్ స్టిక్ పాత్రను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ నాన్ స్టిక్ పాత్రలు ఆయిల్ తక్కువ పడుతుంది? అడుగు మాడకుండా ఉంటుంది. వంట త్వరగా అవుతుంది. అందుకే వీటి వాడకం ఎక్కువవుతుంది. వీటిని రెస్టారెంట్లో కూడా దోషాలు క్రిస్పీగా మృదువుగా రావడానికి వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం వరకు ఓకే కానీ కొన్ని రోజులకు వాటిపై ఉన్న లేయర్లు పోయి చూడ్డానికి చూడడానికి మంచిగా అనిపించవు. అటువంటి ఫ్యాన్స్ ని వాడకపోవడం మంచిది. అలా అవ్వకుండా ఇవి ఎక్కువ రోజులు రావాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

Nonstick Cooking నాన్ స్టిక్ పాత్రలు

నాన్ స్టిక్ పాత్రలు వినియోగం చాలామందికి సాధారణమైపోయింది.

అయితే వీటిని క్లీన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర గిన్నెలా వీటిని తోమకూడదు. ఇలా చేస్తే వాటిపై కోటింగ్ పోతుంది. అలా కాకుండా ఉండడానికి కొన్ని చిట్కాలను పాటించాలి.

వండిన వెంటనే: వీటిని వండిన వెంటనే నీటిలో పెట్టవద్దు. ఇది చల్లగా అయ్యాక దాంట్లో నీరు వేసి క్లీన్ చేయాలి. ఇలా చేస్తే ఆ పాన్ కోటింగ్ పోదు. ఎక్కువ రోజులు ఉంటుంది.
ఈ పాత్రలు ఉంచే ప్రదేశం: అలాగే కిచెన్లో కుక్ వేర్ ని ప్లేస్ చేసే స్థలం కూడా సరి అయింది గా ఉండాలి. పదునైన అంచులు ఉన్న కంటైనర్ మధ్యలో వీటిని పెట్టవద్దు.. వీటిని సపరేట్ ప్లేట్లలో ఉంచాలి. నాన్ స్టిక్ పాన్ పై గీతలు పడకుండా చూడాలి.

ఎస్ టిక్ ఫుడ్: నాన్ స్టిక్ పాత్రలో నిమ్మకాయలు, టమాటాలు వంటి ఆహారాలని వండకపోవడమే మంచిది. ఇవి నాన్ స్టిక్ నాశనం చేస్తాయి. నాన్ స్టిక్ పాత్రలో అధిక ఆమ్లా ఆహారాలను వండడం ఇకనుంచి మానుకోండి. ఎందుకంటే అవి కుకింగ్ వేర్ యనమిల్ నీ నాశనం చేస్తాయి.

ముందుగా సబ్బు నీటితో శుభ్రం: ఈ పాత్రని కొనేటప్పుడు దాని సబ్బు నీటితో క్లీన్ చేయవచ్చు. తర్వాత మెత్తని స్పాంజితో స్క్రబ్ చేయాలి. ఇది మొత్తంగా ఎండిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. నాన్ స్టిక్ పాన్ తక్కువ మద్యస్థ వేడికి అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ టెంపరేచర్ దీనికి పనికిరాదు..

మెటల్ స్పూన్స్; వీటిని వాడేటప్పుడు మెటల్ స్పూన్స్ కత్తులని అస్సలు వాడొద్దు. పదునైన కత్తులని వాడడం వలన నాన్ స్టిక్ పాత్ర లేయర్ పోతుంది. కావున ఈ నాన్ స్టిక్ పాత్ర పై చెక్క స్పూన్లు, సిలికాన్ స్పూన్లు వాడడం మంచిది.

నాన్ స్టిక్ దోస పాత్ర: నాన్ స్టిక్ పాత్ర వాడేటప్పుడు నూనె వాడొద్దని చెప్తూ ఉంటారు. కానీ మీరు కొద్ది మొత్తంలో నూనెను వాడొచ్చు.. కొంచెం నూనె తీసుకొని అన్ని వైపులా రుద్దాలి. ఆ తర్వాత పేపర్ ని తీసుకొని బాగా తుడిచి దోసెను వెయ్యాలి. ఇలా చేస్తే దానిపైన కోటింగ్ ఎక్కువ కాలం ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది