kidney : మన చెడు అలవాట్లే కిడ్నీలను పాడు చేస్తాయంట తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

kidney : మన చెడు అలవాట్లే కిడ్నీలను పాడు చేస్తాయంట తెలుసా…!

kidney : మా శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. అయితే కిడ్నీలు అనేవి మన శరీరంలో ఎంతో అవసరమైన అవయవాలు. వాటి ప్రధాన పని మన శరీరంలో ఉన్నటువంటి మలినాలను ఫిల్టర్ చేయటం. అలాగే మూత్రపిండాలనేవి సరిగ్గా పని చేయకపోయినా లేక విఫలమైనా అప్పుడు మన శరీరంలో టాక్సిన్స్ అనేవి పేరుకుపోవడం మొదలవుతుంది. ఇది ఇతర రకాల వ్యాధులను కూడా వ్యాప్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు కిడ్నీ గనక ఫెయిల్యూర్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 July 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  kidney : మన చెడు అలవాట్లే కిడ్నీలను పాడు చేస్తాయంట తెలుసా...!

kidney : మా శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. అయితే కిడ్నీలు అనేవి మన శరీరంలో ఎంతో అవసరమైన అవయవాలు. వాటి ప్రధాన పని మన శరీరంలో ఉన్నటువంటి మలినాలను ఫిల్టర్ చేయటం. అలాగే మూత్రపిండాలనేవి సరిగ్గా పని చేయకపోయినా లేక విఫలమైనా అప్పుడు మన శరీరంలో టాక్సిన్స్ అనేవి పేరుకుపోవడం మొదలవుతుంది. ఇది ఇతర రకాల వ్యాధులను కూడా వ్యాప్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు కిడ్నీ గనక ఫెయిల్యూర్ అయినట్లయితే డయాలసిస్ ను ఆశ్రయించాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే. మన చెడు అలవాట్ల వలన మూత్రపిండల సమస్యలు వస్తాయి అని మీకు తెలుసా. అవును ఇది నిజం. మన చెడు అలవాట్లే మన కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. నిజం చెప్పాలంటే కిడ్నీలు అనేవి సరిగ్గా పని చేస్తేనే శరీరంలో ఎన్నో పనుల్లో సమస్యలు అనేవి ఉండవు.

కానీ ఎలాంటి సమస్య అయినా మొదలైంది అంటే ఎన్నో వ్యాధులు వస్తాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనితో పాటుగా ఎంతో ముఖ్యమైన అవయవాలు కూడా దెబ్బతినె అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే ప్రస్తుతం మన బిజీ లైఫ్ మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల మన కిడ్నీలు కూడా పాడవుతున్నాయి. బాధాకర విషయం ఏమిటి అంటే. ఈ తప్పులు అనేవి మనకు తెలియకపోవడం. ఒకవేళ ఆ తప్పులు అనేవి మనకు తెలిసిన వాటిని పట్టించుకోకపోవడం అని నిపుణులు అంటున్నారు.ఈ అలవాట్లు కిడ్నీలను దెబ్బతీస్తాయి ఎక్కువసేపు మూత్రాన్ని బిగపట్టుకొని ఉండడం : సాధారణంగా మనం ప్రయాణం చేసే టైంలో లేక నిద్రించే టైమ్ లో తెల్లవారే వరకు మూత్రాన్ని బిగపట్టుకొని ఉంటాము. ముఖ్యంగా చెప్పాలంటే మార్కెట్లో లేక రోడ్డు పక్కన ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్ అందుబాటులో లేనప్పుడు ఎంతో మంది టైం కి మూత్ర విసర్జన అనేది చేయరు. అయితే ఇలా చేయటం ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది. ఇలా చేయటం వలన కిడ్నీపై ఒత్తిడి అనేది పెరిగి ఎంతో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది…

kidney తక్కువ నీరు త్రాగడం

మన శరీరం అనేది ఎక్కువ భాగం నీటితోనే ఉంటుంది. కావున రోజంతా కూడా మన శరీరాన్ని హైబ్రిడ్జ్ గా ఉంచటం ఎంతో అవసరం. దీనివలన శరీర భాగాలు అన్నీ కూడా ఎంతో సక్రమంగా పనిచేస్తాయి. అయితే శరీరంలో నీటి కొరత అనేది ఏర్పడినప్పుడు శరీరంలో విష పదార్థాలు అనేవి బయటకు రాకపోవటమే కాక కిడ్నీలనేవి మురికిని శుభ్రం చేయడం ఎంతో కష్టమవుతుంది. దీంతో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంటుంది…

kidney మన చెడు అలవాట్లే కిడ్నీలను పాడు చేస్తాయంట తెలుసా

kidney : మన చెడు అలవాట్లే కిడ్నీలను పాడు చేస్తాయంట తెలుసా…!

కిడ్నీలు పాడయ్యే ఆహారాలు తినడం : మనం తీసుకునే ఆహారం కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని పాడు చేయటానికి కారణం అవుతాయి. కావున పచ్చి కూరగాయలు మరియు తాజా పండ్లు,పండ్ల రసాలు లాంటి ఆరోగ్యకరమైన వాటిని తీసుకోవటం మంచిది. అలాగే అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే మీరు బేకన్, సాసేజ్, హాట్ డాగ్లు, రెడ్ మీట్, బర్గర్లు, పిజ్జా, ప్రాసెస్ చేసేటటువంటి పదార్థాలను తీసుకుంటే అవి మూత్రపిండాలకు ఎంతో హాని కలిగిస్తాయి. కాబట్టి మూత్రపిండాలకు హాని కలిగించే ఆహారాలను తీసుకోకుండా ఉండటంతో పాటు ఎక్కువ నీరు తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది