After Eat Sleeping : భోజనం చేయగానే నిద్రపోతే ఏమవుతుందో తెలుసా…!
ప్రధానాంశాలు:
After Eat Sleeping : భోజనం చేయగానే నిద్రపోతే ఏమవుతుందో తెలుసా...!
After Eat Sleeping : చాలామంది బ్రేక్ఫాస్ట్ తక్కువగా.. లంచ్, డిన్నర్ హెవీగా చేస్తారు. అయితే అలా లంచ్ డిన్నర్ ఎక్కువగా తిన్న వెంటనే అలాంటివారికి నిద్ర వస్తుంది. తిన్న వెంటనే అలా నిద్ర పోవడం వల్ల శరీరంలో ఎన్నో అనర్ధాలు జరుగుతాయి.. మీరు తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక ఒబిసిటీ అధిక బరువు లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే నిజానికి అలా ఎందుకు జరుగుతుందో తెలుసా.. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది లంచ్ డిన్నర్ హెవీగా చేస్తారని ముందే చెప్పుకున్నాం కదా.. అయితే అలా ఎక్కువగా భోజనం చేసినప్పుడు శరీరంలో క్లోమ గ్రంది ఇన్సులిన్లు ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఈ క్రమంలో శరీరంలో ఇన్సులిన్ ఎక్కువైనప్పుడు మెదడుకు సాంకేతా లు అందుతాయి.
రెండు హార్మోన్లను మెదడు ఉత్పత్తికి ప్రేరేపిస్తుంది. అందుకే మధ్యాహ్నం లంచ్ ఎక్కువగా చేస్తే అనేకమందికి నిద్ర వస్తుంది. సహజంగా వచ్చే నిద్రతోనే నిద్రలోకి జారుకోవచ్చు. అదే మరుసటి రోజున మనల్ని ఆక్టివ్గా ఉంచుతుంది. అయితే అన్నం తక్కువగా తింటే మళ్లీ ఆకలి వేస్తే ఎలా అలా ఆకలి వేసినప్పుడు పండ్లు నట్స్ వంటివి తినాలి. అవి కూడా లైట్ గా తీసుకోవాలి. దీంతో నిద్ర రాదు. యాక్టివ్ గా ఉంటారు.భోజనం చేశాక ప్రతి ఒక్కరూ కాసేపు విశ్రాంతి తీసుకోవాలని ఆయుర్వేదంలో చెప్పబడింది. రేకుల ఉదృత లక్షణంతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరూ భోజనం చేశాక వీలున్నప్పుడల్లా కొద్దిసేపు నేల మీద పడుకోవడం మంచిది.
అయితే ఈ సమయంలో నిద్రకు ఉపక్రమించడం అవసరం కాదు. మంచిది కూడా కాదు. వెళ్లేకిలా వీపు మీద లేదా ఎడమ భుజం వైపుకి తిరిగి ఐదు నుంచి పది నిమిషాల పాటు పడుకోవాలి. దీనివల్ల జీర్ణక్రియ సుఖంగా సహజంగా మొదలవుతుంది. భోజనం చేయడానికి ముందు కొద్ది నిమిషాలు స్థిరంగా కూర్చోవడం చాలా మంది విషయంలో ఉపయోగకరంగా ఉంటుంది. భోజనం మొదలు పెట్టడానికి ముందు సుమారు ఐదు నిమిషాల పాటు మీరు ఒక్కరే ప్రశాంతంగా కూర్చోవడానికి ప్రయత్నించాలి. అలాగే భోజనం కూడా చేయాలి. ఆ తర్వాత మరే పనైనా ప్రారంభించాలి. ఈ మాత్రం సమయం వెచ్చించడం జీర్ణక్రియ విషయంలో ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుంది… అయితే భోజనం చేసిన గంట తర్వాత నిద్రించడం మంచిది….