Black Raisins : ఎండిన నల్ల ద్రాక్ష లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే అసలు వదిలిపెట్టరు…!
Black Raisins : ప్రస్తుతం మనం ఉన్న ఈ ఆధునిక కాలంలో మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన కలిగే అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎంతో మంది అల్పాహారానికి ముందు డ్రై ఫ్రూట్స్ ను తినటం అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి నల్ల ఎండు ద్రాక్ష. డ్రై ఫ్రూట్స్ లలో ఎండు నల్ల ద్రాక్ష ప్రతి నిత్యం తీసుకోవడం వలన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. వీటిని తీసుకోవటం వలన శరీరంలోని రక్తహీనతను కూడా నియంత్రిస్తుంది. అంతేకాక జుట్టుకు మరియు చర్మానికి కూడా ఎంతో బాగా పని చేస్తుంది. అలాగే శరీరానికి అవసరమైన పోషకాlu కూడా ఈ ఎండు ద్రాక్ష లో ఉన్నాయి. వీటిలో చక్కెర,ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, సోడియం,మెగ్నీషియం, విటమిన్లు, ఐరన్ లు అధికంగా ఉన్నాయి. అలాగే రక్తపోటు, గుండె, ఎముకలు, కడుపు, చర్మం, జుట్టు సమస్యలను కూడా తొందరగా నయం చేస్తుంది.
ఎండిన నల్ల ద్రాక్ష లో మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఫైబర్,సోడియం, పొటాషియం,మెగ్నీషియం, విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కావున వీటిని రాత్రి మొత్తం కూడా నీటిలో నానబెట్టుకొని,ఉదయం లేవగానే ఆ నీటిని తీసుకోవటం వలన జుట్టు ఎంతో బలంగా తయారవుతుంది. అంతేకాక జుట్టు రాలే సమస్య నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు ఈ నల్ల ద్రాక్షలను రోజు తీసుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.
ఎండు నల్ల ద్రాక్ష లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కావున ఈ ద్రాక్ష లను రోజు బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకున్నట్లయితే రక్తహీనత సమస్య నుండి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఈ ఎండిన నల్ల ద్రాక్షల్లో విటమిన్ సి,ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి వీటిని ప్రతినిత్యం తీసుకోవడం వలన శరీరంలోని రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనిలో పొటాషియం అనేది కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఈ ఎండిన నల్ల ద్రాక్ష గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. గుండెను బలపరచడంతో పాటుగా, గుండె సమస్యల నుండి కూడా వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. ఎండు నల్ల ద్రాక్షలోని రేస్ వేరాట్రాల్ భాగం రక్త ప్రవాహాన్ని బాగా మెరుగుపరుస్తుంది. ఇది రక్తం గడ్డ కట్టడాన్ని కూడా తొందరగా తగ్గిస్తుంది…