Health Benefits : ఆనందయ్య గారి ఔషధంలో వాడి కొండ పల్లేరు ఉపయోగాలు తెలుసా?
Health Benefits : పల్లేరు కాయల గురించి పల్లెల్లో పుట్టిన వారికి తెలిసినంతగా పట్నం ప్రజసకు తెలియదు. ముళ్లతో ఉండే ఈ చిన్న కాయల్లో ఎన్నెన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. సముద్ర తీరాలు, ఇసుక నేలలో మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి కాళ్లకు, చేతులకు గుచ్చుకున్నాయంటే చాలు విపరీతమైన నొప్పి కల్గుతుంది. కానీ దీని వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. ఈ పల్లేరు కాయలను దంచి అశ్వగంధ పాలలో మరిగించి తాగవం వల్ల అలసట, ఒత్తిడి, డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే ఈ కాయలను దంచి పొడి చేసి అందులో వావిలు పొడి కలిపి తాగడం వల్ల పరుషుల్లో లైం… శక్తి పెరుగుతుంది.
స్త్రీలలో బహిష్టు, గర్భాశయ దోషాలు తొలగిపోతాయి.పల్లేరు కాయల్లో రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి చిన్న పల్లేరు కాయలు.. రెండోది కొండ పల్లేరు లేదా ఏనుగు పల్లేరు కాయలు. పల్లేరు కాయల పొడి తింటే ఆరోగ్యకరమైన సంతానం కల్గుతుంది. ఈ పల్లేరు కాయలు నీటిలో మరిగించిన కషాయం రోజూ తాగడం వల్ల పైత్యం వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది. పల్లేరు పువ్వులు మెత్తగా పేస్టు చేసుకుని కషాయంలా చేసుకొని తాగితే దగ్గు, క్షయ వంటి శ్యాసకోశ వ్యాధులు తగ్గుతాయి. పల్లేరు కాయల పొడి పాలలో కలిపి తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. మొక్క వేళ్లతో సహా దంచి పాలలో నానబెట్టి తర్వాత పాలు కలిపి వడకట్టి చూర్ణంలో తేనె కలిపి తాగితే ఆయాసం, ఉబ్బసం తగ్గడంలో సాయ పడతాయి.
అలాగే కొండ పల్లేరు కాయలను పొడి చేసి అందులో వావిలాకు పొడి కలిపి రోజుకు రెండు చెంచాలు తీసుకుంటే కాలేయం శుభ్ర పడి శరీరంలో అనేర రకాల వ్యాధులను తగ్గిస్తుంది. ఈ పొడి శరీరంలోని వేడిని తగ్గించి చలవ చేస్తుంది. అంతే కాకుండా డయారేయి వల్ల విరోచనాలు ఉన్న వారికి పెద్ద పల్లేరు కాయలు కషాయం చేసి తాగితే విరోచనాలు తగ్గుతాయి. ఈ పొడిని క్రమం తప్పకుండా తీసుకుంటే హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. మూత్రంలో నొప్పి మంట వంటి మూత్ర సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది. కొండ పల్లేరు లేదా పల్లేరు కాయలు దొరికిన వాళ్లు ఇలా చేస్కొని తాగడం వల్ల ఎన్నో ఆనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.