Health Benefits : మూడే మూడు రోజులు పాలల్లో కలుపుకొని తాగండి.. పది రకాల సమస్యలకు చెక్ పెట్టిండి!
Health Benefits : ఈ మధ్య చాలా మంది వయసుతో సంబంధం లేకుండా పలు రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులోనే దీర్ఘ కాళిక సమస్యల బారిన పడుతున్నారు. జీవితం మొత్తం మెడిసిన్లు, ఆస్పత్రులతోనే గడిపేస్తున్నారు. అంతే కాకుండా చిన్న వయసులోనే ఆర్థరైటిస్, ఆర్థియో పోరోసిస్ వంటి అనేక కీళ్ల సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి వ్యాధులకు ఆహారం కూడా ప్రధాన కారణం అని ఆరోగ్య నిపుణులు చెబున్నారు. చిన్నప్పటి నుంచి మంచి ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలు ఎదిగే కొద్ది బలంగా తయారవుతారని చెబుతున్నారు. అందుకోసం బయట మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను పాలలో కలిపి తాగే కంటే ఇంట్లో తయారు చేసుకుని కొన్ని రకాల పౌడర్లు పోషకాహారం అందించి మనల్ని దృఢంగా తయారు చేస్తుంది.
వాటిని తయారు చేసుకోవడం చాలా సులభం. కేవలం ఇంట్లో దొరికే పదార్థాలతోనే వాటిని తయారు చేసుకోవచ్చు. నువ్వులను, బాదం పప్పులను తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ రాత్రి ఐదు బాదం పప్పులను నాన బెట్టాలి. ఉదయాన్ వాటిపైనే ఉన్న పొట్టు తీసేసి పరగడుపున తినాలి.బాదం పప్పులతో పాటు నువ్వులను బాగా వేయించి పొడి చేసి రోజుకు ఒక స్పూన్ పాలలో కలిసి లేదా నేరుగా తినడం వల్ల అనేక రకాల పోషకాలు, ఖనిజాలు శరీరానికి అందుతాయి. బాదం పోషకాల శక్తితో నిండిన పదార్థం. బాదం అనేక రకాలుగా ప్రయోజనకారి. నాన బెట్టిన బాదం తినడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
మాములు బాదం కంటే కూడా నాన బెట్టిన బాదాన్ని అరిగించుకోవడం చాలా తేలిక. చర్మం, జుట్టుకు కావాల్సిన పోషకాలు బాదంలో పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేసి మంచి కొవ్వును అందిస్తుంది.నువ్వుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ట్రైగ్రిజరైడ్స్ ను తగ్గించవచ్చు. దీనిలో ఫ్లాంట్ ప్రోటీన్ యొక్క పోషకాలు అధికంగా ఉంటాయి. రక్త పోటుకు తగ్గించేందుకు నువ్వులు సాయపడతాయి. వేయించిన నువ్వులను పిల్లలకు ఇవ్వడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.