Health Benefits : పిక్కలు, కొండరాల నొప్పిని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన చిట్కా..!
Health Benefits : ఉద్యోగరీత్యా లేదా కొన్నిసార్లు బయట ఏదైనా పనిమీద తిరిగినప్పుడు ఎక్కువగా నడవాల్సి ఉస్తుంది. అయితే చాలా సేపు నిలబడి ఉండడం వల్ల కాళ్లు పట్టేసి పిక్కలు, కాళ్లు లాగుతుంటాయి. పడుకున్నా నొప్పులు మాత్రం తగ్గవు. అయితే అలాంటప్పుడు మనం ఓ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేస్కుంటూ ఉంటాం. ఇలా తరచుగా ట్యాబ్లెట్లు వేసుకోవడం అంత మంచిది కాదు. కాబట్టి పలు రకాల వంటింటి చిట్కాలతోనే నొప్పులను దూరం చేసుకోవాలి. అయితే ముఖ్యంగా కాళ్లు, పిక్కలు, కండరాల నొప్పులను తగ్గించుకునేందుకు ముద్ద కర్పూరం, ఆవ నూనె తీసుకోవాలి. ముద్దు కర్పూరాన్ని మొత్తని పొడిలా చేసుకొని కొద్దిగా ఆవనూనెలో కలిపి నొప్పి ఉన్న చోట రాసి ఐదు నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో ఉన్న నొప్పులు తగ్గుతాయి.
కండరాలు రిలాక్స్ అయి కాళ్ల పట్టేయడం తగ్గుతుంది. తర్వాత ఒక రెండు కాటన్ టవల్స్ తీసుకొని, వాటిని వేడి నీటిలో ముంచి నీటిని పిండేసి కాళ్లకు చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కండరాల నొప్పులు, వాపులు క్షణాల్లో తగ్గిపోతాయి.అయితే దీని నుంచి వేడి త్వరగా పోకుండా ఉండేదుకు కాటన్ క్లాత్ పై ఏదైనా పాలిస్టర్ క్లాత్ చుట్టాలి. ఒకసారి చల్లగా అయిపోయిన టవల్ ని మళ్లీ వేడి నీటిలో ఉంచి మరోసారి కట్టుకోవాలి. ఇలా నొప్పులు ఎక్కువగా ఉండే రోజుకు రెండు సార్లు ఆవనూనె, కర్పూరం మర్దనా చేసి టవల్స్ కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కర్పూరాన్ని చర్మానికి అప్లై చేసినప్పుడు నొప్పి మరియు దురద వంటి లక్షణాల నుండి ఉపశమనం కల్గించే నరాల చివర్లను ప్రేరేపిస్తుంది.
కర్పూరం గోళ్లలో ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే శిలీంధ్రాలకు వ్యతిరేకంగా కూడా చురుకుగా పని చేస్తుంది. ఆవనూనెతో క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల కీళ్లు మరియు కండరాల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ రోగులు కూడా ఆవనూనెతో మసాజ్ చేసిన తర్వాత ఉపశమనం మరియు సౌకర్యాన్ని అనుభవిస్తారు.ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఆవనూనెలో అధికంగా ఉంటాయి. అయితే ఆర్థరైటిల్ కారణంగా ఏర్పడే దృఢత్వం మరియు నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి. వేడి నీటి సంచులు సాధారణంగా మీ కండరాలకు అవసరమైన వేడిని ఇవ్వడం ద్వారా వాటిని విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగిస్తారు. ఇది కండరాల నొప్పిని తొలగించడంలో, బెణుకులను నయం చేయడంలో మరియు మరిన్నింటిలోనూ సాయపడుతుంది. అలాగే మహిళలకు నెలసరి సమయాల్లో వచ్చే ఋతుస్రావ నొప్పిని నయం చేయడంలోనూ దీన్ని ఉపయోగించవచ్చు.