Hair Tips : బట్టతలపై కూడా జుట్టును మొలిపించే అద్భుతమైన చిట్కాలు.. మీ కోసమే!
Hair Tips : మన ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్యలు వస్తున్నాయి. అలాగే తెల్ల వెంట్రకలు కూడా. అంతే కాకుండా చిన్న పిల్లలకు కూడా బట్ట తల వచ్చేస్తుంది. దీని వల్ల చాలా మంది తెగ ఇబ్బంది పడిపోతుంటారు. పది మందిలోకి వెళ్లాన్నా.. మాట్లాడాలన్నా భయపడిపోతుంటారు. అయితే వీటికి ప్రధాన కారణాలు.. జీన్స్, ఒత్తిడి, నిద్రలేమి, జట్టుకు పోషకాలు అందకపోవడం. అయితే వీటన్నిటికి చెక్ పెడ్తూ.. బట్ట తలపై కూడా వెంట్రుకలు మొలిపించే అద్బుతమైన మార్గాలు ఉన్నాయి. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ.. ఉల్లిపాయల్లోని సల్ఫర్ తలకు రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. దీంతో బట్టతల సమస్య రాకుండా చూసుకోవచ్చు. ఇందుకోసం ఒక ఉల్లిపాయను కోసి గ్రైండ్ చేసి రసం తీస్కొని అందుల తేనె కలిపాలి. ఆ తర్వాత దీన్ని తలకు పట్టించి కాసేపు బాగా మసాజ్ చేయాలి. ఇది హెయిర్ ఫాలికల్స్ కి రక్త ప్రసరణ పెరిగేలా చేస్తుంది. అలాగే శిలీం్దరాలు మరియు బ్యాక్టీరియాను చంపుతుంది.

amazing tips for regrow hair on bald head
ఆముదం.. బట్టతల సమస్యను దూరం చేయడంలో ఆముదం నూనె చాలా ప్రభావ వంతంగా పని చేస్తుంది. ఇది మాయిశ్చరైజింగ్ ఏజెంట్ లా పన చేస్తుంది. అనేక జుట్టు మరియు చర్మ సమస్యలను కూడా నయం చేస్తుంది. బట్టతల నుండి బయటపడాలంటే దీపం నూనెను వేలితో తాకి తలకు రాసుకోవాలి. కాసేపు మసాజ్ చేయాలి. దీని వల్ల జుట్టు మూలాలకు పోషణ అంది జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది.
కలబంద… కలబంద అనేది హెర్బాషియస్ ప్లాంట్. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జుట్టు మరియు చర్మ సమస్యలను దూరం చేయడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. ప్రధానంగా అలోవెరా జెల్ జుట్టు పెరుగుదలకు సహాయ పడుతుంది. అలోవెరా జెల్ ను తలకు పట్టించి కాసేపు మసాజ్ చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే జుట్టు ఎదుగుదలలో చక్కని మార్పును చూడొచ్చు. ఇవే కాకుండా కొబ్బరి నూనె, మెంతులు, నిమ్మకాయ, బీట్ రూట్ , బీట్ రూట్ ఆకులు, పెరుగుతో కూడా బట్టతలను, జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.