Apple VS Apple Juice : యాపిల్ పండు మరియు యాపిల్ జ్యూస్ … ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Apple VS Apple Juice : యాపిల్ పండు మరియు యాపిల్ జ్యూస్ … ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 February 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Apple VS Apple Juice : యాపిల్ పండు మరియు యాపిల్ జ్యూస్ ... ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా...?

Apple VS Apple Juice  : ప్రస్తుత కాలంలో ఆపిల్ పండును Apple ప్రతి ఒక్కరు కూడా తింటూనే ఉన్నారు. కొందరు అస్సలు ఫ్రూట్స్ అంటేనే ఇష్టపడరు. ఇలాంటివారు రోజుకు ఒక యాపిల్ తినాలన్నా కష్టంగా ఫీల్ అవుతారు. కొంతమంది పండు రూపంలో తినలేక జ్యూస్ Apple Juice  లాగా తాగుతారు. అయితే ఆరోగ్యానికి మెయిల్ చేసే ఆహారాల్లో ఆపిల్ పండు కూడా చాలా ముఖ్యమైన పండు. అయితే డాక్టర్స్ రోజుకి ఒక ఆపిల్ అయినా సరే తినడానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. ఎందుకంటే ఆపిల్ తింటే అనేకవ్యాధుల నుంచి శరీరం కాపాడబడుతుంది. అందుకే దీన్ని క్రమం తప్పకుండా తినాలని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే కొంతమందికి ఈ సందేహం ఉండవచ్చు.. ఆపిల్ ని పండుగా తినాలా లేదా జ్యూస్ లా తాగాలా ఈ రెండిటిలో ఏది మంచిది. అని తెలుసుకుందాం…

Apple VS Apple Juice యాపిల్ పండు మరియు యాపిల్ జ్యూస్ ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా

Apple VS Apple Juice : యాపిల్ పండు మరియు యాపిల్ జ్యూస్ … ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో తెలుసా…?

తరచు కూడా డాక్టర్స్ రోజుకి కనీసం ఒక యాపిల్ అయినా తినండి అని మనకి చెబుతూనే ఉన్నారు. రోజుకి ఒక ఆపిల్ తింటే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. యాపిల్ లో వ్యాధినిరోధక శక్తి ఉంటుంది. దీనివల్ల అనేక వ్యాధుల నుండి కాపాడబడవచ్చు. అందుకే యాపిల్ ని తినాలి. అయితే కొంతమందికి మాత్రమే ఆపిల్ ని పండులా తింటే హెల్త్ కి మంచిదా లేదా జ్యూస్ లా తాగితే ఎక్కువ ఉపయోగాలు ఉంటాయా అనే డౌటు ఉంటుంది. అయితే ఈ రెండు పద్ధతిలో ఏది ఎక్కువ ప్రయోజనకరమైనది అనే దాని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం… సాధారణంగా వైద్యులు అభిప్రాయం ప్రకారం… ఆపిల్ను జ్యూస్ కంటే పండుగా తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. ఆపిల్ పండును నేరుగా తింటేనే దానిలోని విటమిన్స్ మనకు అందుతాయి. ఈ ఆపిల్ లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అయితే జ్యూస్ చేసి అందులో చక్కెర వేయటం వలన కేలరీలు గణనీయంగా పెరిగి షుగర్ లెవెల్స్ కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఇది అంతా మంచిది కాదు ఆరోగ్యానికి. అలాగే ఆపిల్ రసంలో ఫైబర్ ఉండదు. ఎందుకంటే ఆపిల్ రసం వడకట్టబడుతుంది. ఆపిల్ పిక్ అంతా బయటనే ఉండిపోతుంది.

అది వేస్ట్ అవ్వడం వల్ల ఉత్తీరసం తాగితే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. ప్రోటీన్స్ అన్నీ కూడా ఆ పిప్పి లోనే ఉన్నాయి. అందుకే ఆపిల్ ని నేరుగా తింటేనే అన్ని ప్రోటీన్స్ మనకి సమృద్ధిగా అందుతాయి. అంతేకాదు ఆపిల్ లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు కూడా ఎరుపు రంగులో ఉన్న ఆపిల్ ని మరియు ఆకుపచ్చ రంగులో ఉన్న ఆపిల్ ని ఈ రెండిటిలో ఏ ఒక్కటి తిన్నా కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే గ్రీన్ ఆపిల్ షుగర్ పేషెంట్లకి మంచిది. అంతేకాదు ఆపిల్ తొక్కలో ఉండే పెక్టీన్, ఇతర జీర్ణ ఎంజయములో జీర్ణ క్రియ కు సహాయపడతాయి. ఇంకా, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. ఆపిల్ రసం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి కాలేయంపై ఒత్తిడిని కలుగజేస్తుంది. కాబట్టి ఆపిల్ జ్యూస్ కంటే పండు తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. వీలైనంతవరకు ఎక్కువ పనులను తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు అందుతాయి. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. ఆపిల్ తింటే రక్తహీనత తగ్గి,హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అందుకే ఆపిల్ ని ప్రతి ఒక్కరు కూడా నేరుగా తినడానికి అలవాటు చేసుకోండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది