Coconut Oil : శీతాకాలంలో రాత్రిపూట శరీరానికి కొబ్బరి నూనె పట్టించి నిద్రపోయారంటే…. ఇక తెల్లారేసరికి అద్భుతం జరుగుతుంది….
ప్రధానాంశాలు:
Coconut Oil : శీతాకాలంలో రాత్రిపూట శరీరానికి కొబ్బరి నూనె పట్టించి నిద్రపోయారంటే.... ఇక తెల్లారేసరికి అద్భుతం జరుగుతుంది....
Coconut Oil : కొబ్బరి నూనెతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కొంతమందికి ఇంకా తెలియదు. అందుకేనేమో మన కళ్ళముందే ఉన్న దాని ఎలా వినియోగించాలో తెలియక సతమతమవుతుంటాం. అయితే ముఖ్యంగా చలికాలంలో రాత్రి పడుకునే ముందు ఒంటినిండా కొబ్బరి నూనెను పట్టిస్తే ఒక మిరాకిల్ జరుగుతుంది. ఎండాకాలం, వర్షాకాలం కంటే చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మనం చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేకాదు ఈ సమయంలో వింటర్ సీజన్ వ్యాధులు కూడా ఎక్కువగా ప్రబులుతాయి. కాబట్టి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తదితర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
చలికాలంలో శరీరంలో అక్కడక్కడ కండరాల నొప్పులు కూడా పెరుగుతాయి. ఇటువంటి సీజన్లో కొబ్బరి నూనెను పాదాలకు అప్లై చేయడం వల్ల కీళ్ల, మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. మరి రాత్రిళ్ళు నిద్రించు సమయంలో ఈ కొబ్బరి నూనె రాసుకుని పడుకోవటం వల్ల వేగంగా ఫలితాలను పొందవచ్చు. అలాగే ఆరోగ్య సంబంధిత సమస్యలకు మరియు అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో కొబ్బరి నూనె చాలా ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరి నూనెను చర్మం రాసి మర్దన చేయటం వలన కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ నూనె ఎక్కువ రాత్రిపూట రాసుకోవడం వలన శరీరానికి కండరాలకి మంచి ఫలితం ఉంటుంది. రాత్రిపూట పాదాలకు నూనెను రాసుకోవడం వల్ల చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే గోర్లు తేమగా, మెరుస్తూ ఉంటాయి చర్మం మృదువుగా మారుతుంది. అలాగే కాళ్ల పగుళ్లు కూడా తగ్గుతాయి. పగుళ్లు కూడా తగ్గుతాయి. శీతాకాలంలో డ్రై అయిపోయి పగుళ్లు ఏర్పడి మంటను కలుగజేస్తుంది, అలాంటి సమయంలో ఈ కొబ్బరినూనెను రాత్రి నిద్రించే సమయంలో ఒకసారి అప్లై చేసుకుని పడుకుంటే ప్రొద్దున్నే లేచేసరికి చర్మం మృదువుగా మారుతుంది. చర్మం ఆరోగ్యం కొరకు ప్యూర్ కొబ్బరినూనెను వాడితే ఇంకా మంచిది.