Are Chettu : ఈ చెట్టు ఆకులు ఎంత విలువైనవో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Are Chettu : ఈ చెట్టు ఆకులు ఎంత విలువైనవో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.!!

Are Chettu : ఏ మొక్క ఆకైనా తుంచి వాసన చూసినప్పుడు అబ్బా భలే బాగుంది స్మెల్ అనుకుంటారు. మరికొందరైతే నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు ఏదైనా ఆకుగానీ వేరుగాని ఉంటే బావుండు, దాన్ని స్మెల్ చూస్తే మంచిగా నిద్రపడితే బాగుండు అనుకుంటారు. ఇంకొందరైతే పెద్ద పెద్ద జబ్బులు కూడా ఇలాంటి ఆకులు ద్వారా నయం అవ్వాలని కోరుకుంటారు. పూర్వకాలంలో ఇలాంటి ఆకు పసర్లతోనే చాలా రకాల వ్యాధులు నయమయ్యాయి. ఇప్పుడు ఇన్ని మందులు వాడలేకపోతున్నామని చాలామంది […]

 Authored By aruna | The Telugu News | Updated on :5 January 2024,12:00 pm

Are Chettu : ఏ మొక్క ఆకైనా తుంచి వాసన చూసినప్పుడు అబ్బా భలే బాగుంది స్మెల్ అనుకుంటారు. మరికొందరైతే నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు ఏదైనా ఆకుగానీ వేరుగాని ఉంటే బావుండు, దాన్ని స్మెల్ చూస్తే మంచిగా నిద్రపడితే బాగుండు అనుకుంటారు. ఇంకొందరైతే పెద్ద పెద్ద జబ్బులు కూడా ఇలాంటి ఆకులు ద్వారా నయం అవ్వాలని కోరుకుంటారు. పూర్వకాలంలో ఇలాంటి ఆకు పసర్లతోనే చాలా రకాల వ్యాధులు నయమయ్యాయి. ఇప్పుడు ఇన్ని మందులు వాడలేకపోతున్నామని చాలామంది బాధపడుతూ ఉన్నారు. అటువంటి వారి కోసమే ఒక అద్భుత ఔషధ గుణాలున్న మొక్క గురించి చెప్పబోతున్నాను. మనం విపరీతంగా టెక్నాలజీ మీద ఆధారపడ్డాం. కాబట్టి ప్రకృతి వైద్యాన్ని నిర్లక్ష్యం చేసాం. అందుకే ఒకదానికి మందు వేసుకుని ఇంకో వ్యాధి కొని తెచ్చుకుంటున్నాము. మరి పూర్వకాలంలో ఏ వ్యాధికి ఏ మందు అని కాకుండా ఒక చెట్టు ఆకులు గానీ వేరుగాని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లో లేకుండా కొత్త రోగాలు రాకుండా ఉన్న రోగ రోగాలు లేని వాళ్ళు చాలా అరుదని చెప్పొచ్చు. వాటిలో ముఖ్యంగా కీళ్ల నొప్పులు కాళ్ల నొప్పులు, మైగ్రేన్ సమస్య అలసట ఒకటి కాదు అరుగుదల శక్తికి సంబంధించి ఇలా చాలా రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. మరి వీటన్నిటికీ పరిష్కారం మన చేతుల్లోనే ఉందా.. మన చుట్టూనే ఉందా మందులు జోలికి పోకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉందా.. అంటే కచ్చితంగా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఉంది. అది కూడా ప్రకృతి ఒడిలో ఒదిగి ఉంది.

అయితే ఇటువంటి ఔషధ మొక్కల్ని ఎక్కడెక్కడకో కొండల్లో కోనల్లో వెతికి తెచ్చుకోవాల్సిన పనిలేదు. ఇప్పటికీ పల్లెటూర్లలో ఈ ఔషధ గుణాలున్న మొక్కలు బోలెడు దొరుకుతాయి. అలాంటి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న మొక్కే ఇదే…దీని పేరు ఆరేచెట్టు కాకపోతే ఇది కొంచెం అరుదుగా దొరుకుతుంది. ఈ మొక్క ఆకులు సీతాకోకచిలుకల్లా బలే ఉంటాయి. అయితే మహారాష్ట్రలో దీన్ని ఎక్కువగా వాడతారు. ఈ ఆకుని బాగా పరిచయం ఉన్నవాళ్లు బంగారు ఆకులను పిలుస్తారు. అంతే కాదు.. ఈ ఆకులు మహారాష్ట్ర వాళ్ళకి సంప్రదాయ గుర్తుగా కూడా ఉంటాయి. అంటే ఇచ్చి పుచ్చుకునేటప్పుడు కూడా మనం తమలపాకుల్ని ఎలా అయితే వాడతామో ఈ ఆకులను వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడంలో అలా వాడుతారు. మనలో చాలామందికి తెలియకపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో అడవుల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. మహారాష్ట్ర ప్రాంత వాసులకు మాత్రం ఈ చెట్టు చాలా సుపరిచితమే. ఆరు చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ప్రతీది. ఆర చెట్టు కర్ర ఇంటి వాస్తు దోషాలను పోగొడుతుంది. ఆరు కర్ర ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. ఇంటికి నర దిష్టి నేత్ర దిష్టి తగలకుండా చేస్తుంది. ఏ ఇంటిలో ఆర కర్ర ఉంటుందో ఆ ఇంటి వాస్తు దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ చెట్టు కర్ర ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది.

ఇక కొంతమంది తాంత్రిక నిపుణులు కూడా ఈ కార్య గురించి చాలా విశేషంగా చెబుతారు. గ్రహ దోషాలను తొలగిస్తుందని ఈ వేరు ఉన్న తాయత్తు మెడలో ఉంటే గ్రహ దోషాలు నర దిష్టి తగలకుండా ఉంటాయని అంటారు. ఇక ఈ ఆరే చెట్టు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అయితే 95% మంది పంటి సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నోటి దుర్వాసన చిగుళ్ళ నుంచి రక్తం కారడం లేదా పళ్ళు పలుచబడి విరిగిపోవడం ఇటువంటి సమస్యలన్నీ కూడా చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ మొక్క దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఆరే చెట్టు పుల్లలతో పళ్ళు తోముకుంటే దంత సమస్యలు తగ్గుతాయి. పళ్ళ నుంచి రక్తం కారడం నోటి దుర్వాసన చిగుళ్ల వాపులను తగ్గిస్తుంది. మీకు గనక కుదిరితే ఈ ఆరు చెట్టు బెరడు తెచ్చుకొని ఎండబెట్టుకొని పౌడర్లా చేసుకుని స్టోర్ చేసుకోండి ప్రతిరోజు ఆ పౌడర్ తో పళ్ళు తోముకుంటే మీ నోటికి సంబంధించిన ప్రతి విధమైన సమస్యలు పోయి మీ నోరు శుభ్రంగా ఉంటుంది. అలాగే సీజన్లో ఎక్కువగా మలేరియా అని డెంగ్యూ అని రకరకాల జ్వరాలు ఎటాక్ అవుతూ ఉంటాయి. అటువంటి వారికి ఈ చెట్టు ఆకులు చాలా బాగా ఉపయోగపడతాయి.ఏ వ్యాధులైన పోవాలంటే కేవలం మందులతో మాత్రమే కాకుండా మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ.. ఇలాంటి ఔషధాలను కూడా వినియోగిస్తూ ఏ రోగాలనైనా తగ్గించుకోవచ్చు. ఈ మొక్క కనుక మీకు కనిపిస్తే అస్సలు విడిచి పెట్టకండి. ఎన్నో రకాల రోగాలను మటుమాయం చేసే ఈ దివ్య ఔషధ మొక్కను కచ్చితంగా తెచ్చుకోండి

Also read

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక