Mutton Liver : గర్భిణీ స్త్రీలు మటన్ లివర్ ని తింటున్నారా… అయితే ఇది తప్పక తెలుసుకోండి….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mutton Liver : గర్భిణీ స్త్రీలు మటన్ లివర్ ని తింటున్నారా… అయితే ఇది తప్పక తెలుసుకోండి….?

 Authored By ramu | The Telugu News | Updated on :24 December 2024,10:02 am

ప్రధానాంశాలు:

  •  Mutton Liver : ర్భిణీ స్త్రీలు మటన్ లివర్ ని తింటున్నారా... అయితే ఇది తప్పక తెలుసుకోండి....?

Mutton Liver : మాంసాహారాన్ని ఎక్కువగా భుజించేవారు లివర్ ని కూడా ఇష్టంగానే తింటూ ఉంటారు. అయితే ఇందులో పోషకాలతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ, గర్భిణీ స్త్రీలు దీనిని తినకుండా ఉండడమే మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయలు కొన్ని ఆహారాన్ని సూచిస్తున్నారు. జంతువుల్లో ఉండే లివర్ లో ఐరన్, ప్రోటీన్, విటమిన్ బి12 వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని ప్రచారం చేస్తారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (usda ) కూడా కాలేయంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని ధ్రువీకరించింది. అలాగే రక్తహీనత నివారించడానికి ఐరన్ చాలా ముఖ్యపత్రోహిస్తుంది. న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారించడానికి ప్రోటీన్ కీలకం. అయినప్పటికీ గర్భిణీ స్త్రీలకు ఇది అంతగా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. విధంగా తిన్నా కూడా చాలా ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. లివర్ ని ఎక్కువగా తినడం వల్ల అభివృద్ధి చెందుతున్న శిశువు ప్రమాదకరమని చెబుతున్నారు. ఇందులో విటమిన్’ ఏ అధికంగా ఉండటమే ఎందుకు కారణం.యూ u s d a ప్రకారం గర్భిణీ స్త్రీలకు విటమిన్ ఏ రోజుకు 8,000 అవసరమని నిర్ధారించింది. కాని కేవలం 100 గ్రాముల చికెన్ లివర్ లో 11, 100 Iu విటమిన్ ఏ ఉంటుంది. మటన్ లేదా బీఫ్ లివర్ లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రయోజనాలు ఇతర ఆహార పదార్థాల నుంచి పొందవచ్చు.

Mutton Liver గర్భిణీ స్త్రీలు మటన్ లివర్ ని తింటున్నారా అయితే ఇది తప్పక తెలుసుకోండి

Mutton Liver : గర్భిణీ స్త్రీలు మటన్ లివర్ ని తింటున్నారా… అయితే ఇది తప్పక తెలుసుకోండి….?

Mutton Liver గర్భస్థ సమయంలో విటమిన్ ఏ ఎక్కువ తీసుకుంటారు..?

గర్భధారణ సమయంలో విటమిన్ ఏ ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ అధిక మొత్తంలో అది హానికరం అని వైద్యులు చెబుతున్నారు. లివర్ లో పెద్ద మొత్తంలో విటమిన్ ఏ లేదా రెటీనో ల్ కలిగి ఉంటుంది. ఇది ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే విషపూరితమవుతుందని హెచ్చరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు ఎవరు తినడం ఎందుకు నివారించడం జరుగుతుందో వివరిస్తున్న యుపి కి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ అగర్వాల్ ఇలా అన్నారు. లివర్ లో విటమిన్ ఏ కంటెంట్ అధికంగా ఉంటుంది. రెటీనోల్ ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. అయితే అభివృద్ధి చెందుతున్న పిండంలో వైకల్యం కలిగిస్తుంది అని చెప్పారు. అధిక మొత్తంలో ఏ విటమిన్ ఎక్కువగా అందితే వికలాంగులుగా పుడతారు.

లివర్ ఎప్పుడు తినకూడదు : ” విటమిన్ ఏ అధిక స్థాయి వల్ల పిండంలో కేంద్రనాడి వ్యవస్థ, క్రాని యో ఫేషియల్, గుండెలో పుట్టుకతో వచ్చే లోపాలు ముడిపడి ఉన్నాయి. పిండంలో అవయవాలు ఏర్పడే మొదటి త్రైమాసికంలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అగర్వాల్ చెప్పారు.”

లివర్ కు ప్రత్యామ్నాయాలు : గర్భిణీ స్త్రీలు ఒక లివర్ తో మా త్రమే కాకుండా వేరే ఇతర వనరుల నుంచి కూడా అవసరమైన పోషకాలను పొందవచ్చు. లివర్ని పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది.

ఐరన్ :  లిన్ మీట్, బీన్స్, ధాన్యాలు, బచ్చలి కూర, తృణధాన్యాలు వీటిల్లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

ఫోల్లెట్ : ఆకుకూరలు, సిట్రస్ పండ్లు, బీన్స్, ధాన్యాలు వంటి వాటి నుంచి ఫోల్లెట్ లభిస్తుంది.

విటమిన్ బి 12 : చాపలు,మాంసం,పౌలీర్టీ, గుడ్లు, పాల ఉత్పత్తులు వంటి విటమిన్స్ బి12 వీటిల్లో లభిస్తాయి.
“ఈ ప్రత్యామ్నాయలా అధిక విటమిన్ ఏ తీసుకోవడం తో సంబంధం లేకుండా అవసరమైన పోషకాలు అందిస్తాయి అని అగర్వాల్ చెప్పారు “

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది