High Blood Pressure : హై బీపీలు ఇన్ని రకాలు ఉంటాయా.. నిరంతర పర్యవేక్షణ లేకపోతే ఇక ప్రమాదంలో పడినట్లే…!!
High Blood Pressure : నేటి కాలంలో చాలా మంది హైబీపీ సమస్యలతో సతమతమవుతున్నారు.. సహజంగా బిపిని స్పీగ్మో మానోమిటర్ అనే ఒక పరికరంతో మిల్లీమీటర్ల పాదరసంలో కొలుస్తారు. దీన్ని సిస్టోలిక్ ప్రెషర్ డయాస్టోలిక్ ప్రెషర్ గా చెప్తారు. సాధారణంగా రక్తపోటు 125/ 80 వరకు ఉండాలి. దీనికన్నా అధికంగా బిపి ఉంటే హై బీపీ అని తక్కువ నమోదైతే లోబీపీ అని చెప్తుంటారు. నిర్మిత పరిధి కన్నా ఎక్కువగా నమోదయ్యే హై బీపీలు రకాలు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… హైపర్ బిపి రకాలు: మొదట రక్తపోటు: ఇది శరీరంలో ఉన్న కూడా పెద్దగా సంకేతాలు కనిపించవు. సహజంగా ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేనప్పుడు చెకప్ కి వెళ్ళినప్పుడు ఇది బయటపడుతుంది. దీనిని గుర్తించకపోవడం వల్ల స్థూలకాయం డయాబెటిస్ పలు గుండె సంబంధిత వ్యాధులు వస్తుంటాయి.
రెండవ హై బీపీ : హైపర్ టెన్షన్ కేసులో ఐదు నుండి 10% మందిలో ఈ రెండవ ఐ ఫర్ టెన్షన్ గుర్తిస్తూ ఉంటారు. వీరిలో సడన్గా బీపీ పెరిగిపోతుంది. ఈ హై ఫర్ టెన్షన్ కిడ్నీ సంబంధిత రోగుల్లో ఎక్కువగా కనబడుతుంది. రెసిస్టంట్ హైపర్ బిపి : మందులు వాడిన అదుపులో లేని బీపీ ఉన్న వాళ్లని రెసిస్టెన్స్ హైపర్ బిపి రోగులుగా చెప్తుంటారు. వీరికి ఎన్ని మందులు వాడిన ప్రయోజనం ఉండదు. అటువంటి వారిలో కార్డియో వాస్క్లర్ వ్యాధులు గ్రస్తులు అవుతారు. ఆర్గాన్ డ్యామేజీ చివరికి ప్రాణాలు పోతాయి. గర్భధారణ రక్తపోటు: ఇది గర్భిణీలో ఎక్కువగా కనిపించే రక్తపోటు గర్భిణీలో రక్తపోటు ఎక్కువైతే ప్రసూతి మరణం లేదా పిండంలో లోపాలు ఉంటాయి. వైట్ కోట్ హైపర్ టెన్షన్: దీనిని ఐసోలేటెడ్ క్లినిక్ హైపర్ టెన్షన్ అని అంటారు.
ఆసుపత్రిలో లేదా కార్యాలయంలో అధిక రక్తపోటు ఉంటుంది. బయటికి వెళ్ళగానే నార్మల్ అవుతుంది. మనదేశంలో పెద్దవాళ్లు కంటే యువతలోనే ఈ తరహా బిపి అధికంగా కనపడుతుంది. ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి ; డయాబెటిస్ మిల్లి టస్ హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తులు వారి రీడింగ్లను 120, 130 మధ్య ఉంచడానికి పర్యవేక్షణ చేయించుకోవాలి. ఇంట్లోనే చేసే కొలతల కోసం డిజిటల్ పరికరాల ప్రాధాన్యత ఇవ్వచ్చు.. రోగి మరణాలను తగ్గించడానికి సివీడీలు మూత్రపిండా రుగ్మతలు లేదా శిరోద్రోవ వాస్క్లర్ ప్రమాదం ఉన్న రోగులను కాంబినేషన్ తెరపిని తప్పనిసరిగా సిఫార్సు చేస్తూ ఉండాలి. రక్తపోటు నియంత్రణకు ఉత్తమైన చికిత్స ఏజెంట్ను ఎంచుకోవాలి. అందుకోసం ప్రతిరోగి వ్యక్తిగత ప్రొఫైల్ చికిత్సలను అతని శరీరం ప్రతిస్పందిస్తున్న విధానాన్ని పరిగణలోకి తీసుకోవాలి.