వ్యాధి లక్షణాలే కనిపించవు.. ఆ రోగం వస్తే లైఫ్ క్లోజ్.. ఆ లక్షణాలేంటో తెలుసుకోండి..!
Diseases : కొన్ని రోగాలు చెప్పి వస్తాయి.. కొన్ని రోగాలు చెప్పకుండా వస్తాయి అంటారు. చెప్పి రావడం అంటే కొన్ని రోగాలు వచ్చే ముందు సంకేతాలు పంపిస్తాయి. వాటినే లక్షణాలు అంటారు. శరీరంలో జరిగే మార్పులు, లక్షణాలను బట్టి ఏ వ్యాధి వస్తుందో ఒక్కోసారి గెస్ చేయొచ్చు కానీ.. కొన్ని రోగాలు అయితే చెప్పి రావు. కొన్ని రోగాలు వచ్చేది తెలియదు.. వచ్చింది కూడా తెలియదు. అసలు.. మన శరీరంలో ఏవైనా వ్యాధులు ఉన్నాయో కూడా తెలియకుండా వచ్చి చేరుతుంటాయి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు అయితే.. అవి వచ్చినా కూడా మనకు తెలియదు. వాటి లక్షణాలు కూడా ఉండవు. మనిషి మంచిగానే ఉంటాడు. ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ లోపల అవి చేసే పని చేస్తూనే ఉంటాయి. మనిషి జీవితాన్ని నాశనం చేసేస్తాయి. అవి ఏ వ్యాధులో తెలుసుకుందాం పదండి.
silently Kills This symptoms
Diseases : అధిక రక్తపోటు – High Blood Pressure
అధిక రక్తపోటు లేదా దీన్నే హైబీపీ అని పిలుస్తాం. అధిక రక్త పోటును సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. మనలో బీపీ పెరిగిందని కూడా తెలియదు. అంత సైలెంట్ గా బీపీ పెరిగి పోయి.. లేని పోని అనర్థాలకు దారి తీస్తుంది. అధిక రక్తపోటు ఉందని గుర్తించలేకపోతే.. ఎన్నో సమస్యలు వస్తాయి. గుండె పోటు రావడం లేదా గుండె జబ్బులు రావడం.. చివరకు గుండె ఆగిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అందుకే.. ఎప్పటికప్పుడు బీపీని చెక్ చేసుకుంటూ ఉండాలి.
Diseases : Polycystic Ovary Syndrome
polycystic ovary syndrome
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్.. దీన్నే పీసీఓఎస్ అని కూడా అంటారు. హార్మోన్లలో వచ్చే సమస్యల వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది వచ్చిందని కూడా చాలామందికి తెలియదు. తెలియకుండానే వచ్చి.. ఎటువంటి లక్షణాలు లేకుండా శరీరంలో లేనిపోని సమస్యలను సృష్టిస్తుంది. ఈ సిండ్రోమ్ మహిళలకు ఉంటే.. పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే.. గుండె జబ్బులు, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఈ సిండ్రోమ్ కారణం అవుతుంది.
Lungs Cancer
lungs cancer
లంగ్స్ క్యాన్సర్ లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్.. దీని వల్ల చాలామంది ఈ మధ్య కాలంలో మరణిస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిందంటే మరణం సంభవించడమే. ప్రాథమిక దశలో దీన్ని గుర్తిస్తేనే దీని బారి నుంచి కాపాడుకోవచ్చు. లేదంటే బతకడం కష్టమే. అయితే.. ప్రాథమిక దశలోనే ఊపిరితిత్తుల క్యాన్సర్ ను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే.. దీనికి ఎటువంటి లక్షణాలు ఉండవు. ప్రాథమిక దశను దాటాక… చాతిలో నొప్పి రావడం, పొడి దగ్గు ఎక్కువగా రావడం, అలసట లాంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి.
Glaucoma Diseases
glaucoma
గ్లాకోమా అంటే.. కంటి సమస్యలు వచ్చి అంధత్వం రావడం. ఈ సమస్య ఎక్కువగా వృద్ధులకు వస్తుంటుంది. 60 ఏళ్లు పైబడిన వాళ్లలో ఎక్కువగా గ్లాకోమా సమస్యలు వస్తుంటాయి. ఇది కంట్లో ఉన్న ఆప్టిక్ నాడిని దెబ్బతీస్తుంది. దీంతో కంటి చూపును కోల్పోతారు. అయితే.. గ్లాకోమా వచ్చిందనే విషయం కూడా తెలియకముందే.. కంటి చూపు మందగిస్తుంటుంది. అందుకే.. కంటికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Clamidia Diseases
క్లామిడియా అనేది క్లామిడియా ట్రాకోమాటిస్ అనే బ్యాక్టిరియా వల్ల వస్తుంది. ఈ సమస్య వస్తే.. వంధ్యత్వం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే.. దీన్ని ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా కష్టం. తర్వాత దశలో.. మూత్రవిసర్జన సమయంలో నొప్పి రావడం, మహిళల్లో కూడా మూత్ర సమస్యలు రావడం వల్ల క్లామిడియా వచ్చిందని తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి ==> పాలను ఎక్కువగా మరిగిస్తున్నారా…. అయితే ఖచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే?
ఇది కూడా చదవండి ==> రక్తంలో ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గితే ఏం చేయాలి? ఏ ఫుడ్ తీసుకుంటే కౌంట్ పెరుగుతుంది?
ఇది కూడా చదవండి ==> రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయం తింటున్నారా? ముందు ఈ విషయం తెలుసుకోండి.. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం
ఇది కూడా చదవండి ==> ఈ అలవాట్లు మీకు ఉంటే.. పొగతాగడం కన్నా ఎక్కువ ప్రమాదం.. అవేంటో వెంటనే తెలుసుకోండి