Health Benefits : హైబీపీ ఉన్నవారు…ఈ ఉప్పును మాత్రమే తినండి…ఈ ఉప్పుతో… హైబీపీకి చెక్ పెట్టండిలా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : హైబీపీ ఉన్నవారు…ఈ ఉప్పును మాత్రమే తినండి…ఈ ఉప్పుతో… హైబీపీకి చెక్ పెట్టండిలా…

 Authored By prabhas | The Telugu News | Updated on :27 June 2022,10:00 pm

మనం సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వలన వివిధ రకాల రోగాల బారిన పడుతున్నాం. రుచి కోసమని, పోషకాలు లేని వివిధ రకాల ఆహార పదార్థాలను తింటున్నాం. ఇప్పటి వారు ఎక్కువగా బయటి ఆహార పదార్థాలను తినటం వలన వారంతట వారే అనేక అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా సరైన ఆహారం పై దృష్టి పెడితే ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రావని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యానికి కారణమవుతున్న బయటి ఆహారపదార్థాలను తినడం వలన రక్తపోటు, డయాబెటిస్, జీర్ణ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. అధిక రక్తపోటు ఉంటే అంటే హైబీపీ ఉన్నవారు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడతారు. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

అటువంటి పరిస్థితుల్లో హై బీపీని నియంత్రణలో ఉంచుకోవాలంటే ఎటువంటి ఉప్పును వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం… హైబీపీ సాధారణ స్థితిలోకి రావాలంటే ఒక రాతి ఉప్పు మాత్రమే సహాయపడుతుంది. హైబీపీ ఉన్నవారు తినే ఆహారంలో మామూలు ఉప్పు బదులు రాతి ఉప్పు లేదా పింక్ సాల్ట్ ను వాడాలి. ఈ రాతి ఉప్పు ఎటువంటి రసాయన ప్రక్రియ లేకుండా తయారవుతుంది. అందుకే దీనిని స్వచ్ఛమైన ఉప్పు గా పరిగణిస్తారు. అదే సాధారణ ఉప్పు అయితే రసాయన ప్రక్రియలతో తయారుచేస్తారు. దీనివలన ఉప్పులో పోషకాలు తగ్గిపోతాయి. అందుకే ఆహారంలో సాధారణ ఉప్పును వేసుకుంటే ఎటువంటి లాభం చేకూరదు. కనుక తినే ఆహారంలో పింక్ సాల్ట్ ను వాడాలి. అంతేకాకుండా, చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు ఈ రాతి ఉప్పును ఉపయోగిస్తారు. ఒక గ్లాసు నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసుకుని తాగితే వారు రోజంతా యాక్టివ్ గా ఉంటారు.

Health Benefits of pink salt for High blood pressure

Health Benefits of pink salt for High blood pressure

రాతి ఉప్పు వలన ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రాతి ఉప్పు లో క్యాల్షియం, పొటాషియం అధిక మోతాదులో దొరుకుతాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తినే ఆహారంలో ఈ పింకీ సాల్ట్ ను వాడడం వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఎక్కడికైనా వెళ్లొచ్చాక అలసటగా, నీరసం గా అనిపించినప్పుడు ఒక గ్లాసు నీళ్ళలో చిటికెడు రాతి ఉప్పును వేసుకుని తాగితే మంచిగా అనిపిస్తుంది. అలాగే రాతి ఉప్పును తీసుకోవడం వలన కండరాల తిమ్మిరి సమస్య తగ్గుతుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. అలాగే వాంతులు వికారంగా ఉన్నవారు ఒక గ్లాసు నీళ్ళలో కొద్దిగా రాతి ఉప్పు ను వేసుకొని తాగితే ఆ సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. అలాగే రాతి ఉప్పు కంటి చూపు తగ్గకుండా కాపాడుతుంది. కనుక సాధారణ ఉప్పు బదులు రాతి ఉప్పును వాడండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది