Ginger Tea : అల్లం టీ ని ఎక్కువగా తాగుతున్నారా…. ఈ సమస్యలు తప్పవు…!!
ప్రధానాంశాలు:
Ginger Tea : అల్లం టీ ని ఎక్కువగా తాగుతున్నారా.... ఈ సమస్యలు తప్పవు...!!
Ginger Tea : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అయితే ప్రతినిత్యం ఒక కప్పు టీ తాగకుండా ఉంటే ఏదో వెలితిగా అనిపిస్తుంది. అయితే ఈ టీ లో ఎన్నో రకాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో అల్లం టీ కూడా ఒకటి. ఈ అల్లం టీ లో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి. అయితే మనం ప్రతి నిత్యం చిన్న కప్పుతో రెండుసార్లు తాగితే ఎంతో మంచి జరుగుతుంది. కానీ అంతకంటే మించి అల్లం టీ తాగితే సమస్యలు కూడా వస్తాయి. అలాగే వీటిని వర్షాకాలంలో మరియు చలికాలంలో తప్పితే వేసవికాలంలో అల్లం టీని అసలు తాగకూడదు. దీని వలన బీపీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అందువల్ల వేసవికాలంలో అల్లం టీ ఒక కప్పుకు మించి ఎక్కువ తాగటం మంచిది కాదు. దీనివలన డిహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది…
అల్లం టీ ని అధికంగా తాగటం వలన అసిడిటీ సమస్య కూడా పెరుగుతుంది. ఈ అల్లం టీ ని రోజుకు రెండు కప్పులకు మించి తాగితే గ్యాస్,కండరాల తిమ్మిరి,అసిడిటీ లాంటి సమస్యలు కూడా వస్తాయి. అలాగే జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అల్లం టీని ఎక్కువగా తాగటం వలన రక్తం కూడా పల్చగా తయారవుతుంది. మీకు దెబ్బలు తగిలినప్పుడు సన్నగా రక్తం అనేది కారుతుంటుంది. ఇలా గనుక మీ రక్తం ఉంటే వెంటనే అల్లం టీ ని మానేయండి…
ఇది రక్తాన్ని ఇంకా పల్చగా చేసే అవకాశం ఉంటుంది. అలాగే అల్లం టీ ని ఎక్కువగా తాగితే అలర్జీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే లో బీపీ సమస్యతో బాధపడే వారు కూడా అల్లం టీ తాగితే రక్తపోటు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా గనక మీకు బీపీ తక్కువగా ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా అల్లం టీ ని తాగటం అంత మంచిది కాదు. ఇది వేడి చేసే సభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి అల్లం టీ ని ఎక్కువగా తీసుకోకుండా ఉండటమే మంచిది…