Breakfast : వామ్మో… అన్నాన్ని బ్రేక్ ఫాస్ట్ లో తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి…!
ప్రధానాంశాలు:
Breakfast : వామ్మో... అన్నాన్ని బ్రేక్ ఫాస్ట్ లో తింటున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి...!
Breakfast : సహజంగా చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు.. బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ, వడ, దోశ లాంటివి చేసుకొని తింటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం బ్రేక్ ఫాస్ట్ లో అన్నాన్ని తినేస్తూ ఉంటారు. టిఫిన్ ఇడ్లీ, వడ, దోశ ఇలాంటివి చేయలేక డైరెక్ట్ గా అన్నమే తినేస్తూ ఉంటారు.. అయితే బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తింటే ఏం జరుగుతుందో తెలుసా..? బ్రేక్ ఫాస్ట్ లో అన్నాన్ని తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం… కొంతమంది ప్రతిరోజు ఉదయం అన్నం తింటూ ఉంటారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తినడం వలన కొన్ని సమస్యలు వస్తాయి.
అయితే కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అందుకే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో అన్నం తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం… రైస్ లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి మీకు రోజుకు అవసరమైన శక్తిని ఇస్తాయి. అలాగే మిమ్మల్ని రోజంతా యాక్టివ్గా ఉంచుతాయి. కానీ మీరు అన్నాన్ని మరి అధికంగా తింటే బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి.. రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్లు మీరు బరువు పెరిగేలా చేస్తాయి.. ఆంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా: బియ్యంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణాలను డీఎన్ఏ ను దెబ్బతీసే ప్రరాడికల్స్ నుంచి మీ శరీరాన్ని కాపాడతాయి. దీంతో మీ ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం తగ్గుతుంది…గుండె జబ్బులను కంట్రోల్లో ఉంచుతుంది: అన్నం తినడం వలన అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అన్నం తింటే మీ గుండె పదిలంగా ఉంటుంది.రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది; బియ్యం లో విటమిన్ డి, మెగ్నీషియం, పొటాషియం లాంటి విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంతోపాటు మీ శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి..అధిక బరువుకి చెక్; అన్నంలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అన్నం చాలా సులువుగా జీర్ణమవుతుంది. అలాగే మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే రోజు ఉదయం బ్రౌన్ రైస్ ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం చాలా మంచిది.. ఎక్కువ ఫాలిష్ వెయ్యని బియ్యాన్ని రోజుకి మూడుసార్లు తిన్న ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీనిని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవచ్చు..