Sleeping : ఎక్కువ సేపు నిద్రపోయే అలవాటు ఉందా.. ఇక పని అయిపోయినట్టే..!
ప్రధానాంశాలు:
Sleeping : ఎక్కువ సేపు నిద్రపోయే అలవాటు ఉందా.. ఇక పని అయిపోయినట్టే..!
Sleeping : ప్రస్తుతం మనందరికి ఉరుకుల పరుగుల జీవితం. తినడానికి సమయం దొరకడం లేదు, పడుకుందామన్న సమయం ఉండడం లేదు. అయితే జీవగడియారం నడవాలంటే నిద్ర ఎంతో ముఖ్యం అని అందరికి తెలుసు. అయితే నిద్ర కూడా సరైన సమయం వరకే ఉండాలి. మరి ఎక్కువగా పడుకున్నా , లేదంటే తక్కువగా పడుకున్నా కష్టమే. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఎవరైనా సరే 8 గంటల నిద్ర సరిపోతుంది. అయితే నిర్దేశించిన సమయం కాకుండా అంతకన్నా ఎక్కువ గంటలు నిద్రించే వారు అనారోగ్యం బారిన పడతారు అంటుంది ప్రపంచ స్థాయి ఆరోగ్య సంస్థలు. నిద్ర ఎక్కువైతే ఎక్కువ నష్టం కలుగుతుందంట. అతి నిద్ర ఒకరకమైన దీర్ఘకాలిక నాడీ వ్యవస్థ రుగ్మతగా మారుతుందని అంటున్నారు.
Sleeping : నిద్ర ఎక్కువపోతే… అంతే
ఎక్కువ సేపు నిద్రపోయేవారు అధిక బరువు, ఊబకాయం, అలసట వంటి సమస్యలు ఎదుర్కోవడం సహజం. వీరికి గుండె సంబంధిత రోగాలు కూడా వస్తాయి. రోజులో 10 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రించే వారికే 41 శాతం కంటే ఎక్కువగా అకాల మరణాలు, హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు.అతి నిద్ర వలన తలనొప్పి, వెన్ను నొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.. గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 8 గంటల కన్నా ఎక్కువ సమయం నిద్రపోయే వారిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు అధికంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అతిగా నిద్రపోయే వారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. విపరీతమైన అలసట చెందుతారు. ఏ పని కూడా సరిగా చేయలేరు..
నిత్యం అతిగా నిద్రించే వారు త్వరగా చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని సైంటిస్టులు చేబుతున్నారు. మధ్యాహ్నం సమయంలో కూడా పడుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కువ సేపు పడుకునే వారికి ఏకాగ్రత తక్కువ మొత్తంలో ఉంటుందట. అంతేకాదు వీరికి చేస్తున్న వర్క్ పట్ల ఇంట్రెస్ట్ కూడా చూపించలేరని అంటున్నారు. . మగవారికంటే ఆడవారే ఎక్కువగా నిద్రపోతున్నారని అధ్యయనాలు చెబుతుండగా, వారికి గుండె సంబంధిత జబ్బులు వస్తున్నాయి. ఓవర్ వెయిట్ కూడా అతినిద్రకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే మద్యం, డ్రగ్స్, కెఫిన్ తీసుకోవడం వదిలేస్తే అతిగా నిద్రపోవడం తగ్గించుకోవచ్చు.