Vitamins : విటమిన్స్,మినరల్స్ కోసం సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా… ఈ సంచలన విషయం మీకోసమే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vitamins : విటమిన్స్,మినరల్స్ కోసం సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా… ఈ సంచలన విషయం మీకోసమే…!

 Authored By ramu | The Telugu News | Updated on :29 May 2024,11:30 am

ప్రధానాంశాలు:

  •  Vitamins : విటమిన్స్,మినరల్స్ కోసం సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా... ఈ సంచలన విషయం మీకోసమే...!

Vitamins : ప్రస్తుతం మన ఆహారపు అలవాట్ల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందుకే శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. అప్పుడే శరీర ఆరోగ్యానికి కావలసినటువంటి పోషకాలు అందుతాయి. అయితే చాలా మంది కూరగాయలు,పండ్లు ప్రతిరోజు తీసుకోవటానికి ఇష్టపడరు. వీటిని ప్రతిరోజు తీసుకోకపోతే శరీరంలో వివిధ రకాల విటమిన్లు మరియు మినరల్స్ లోపిస్తాయి. అంతేకాక రకరకాల సమస్యల బారిన కూడా పడతారు. దీనితో చాలా మంది విటమిన్లు, మినరల్స్ కోసం సప్లిమెంట్స్ ను ఎక్కువగా తీసుకుంటారు. మార్కెట్లో లభించే సప్లిమెంట్లను తీసుకోవటం వలన శరీరంలోని విటమిన్స్, మినరల్స్ లోపాలను భర్తీ చేసుకుంటారు.

అయితే ప్రస్తుతం పరిశోధనలో ఈ సప్లిమెంట్స్ తీసుకునే అలవాటు పై సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఈ ధోరణి ప్రయోజనకరమైనది కాదు అని తెలిపారు. కొన్ని సందర్భాలలో శరీరంలోని సమ్మేళనాల కొరతను తీర్చేందుకు తొందరగా పోషకలను అందించే సప్లిమెంట్స్ ను తీసుకోవడం అవసరం కావచ్చు. అయితే సప్లిమెంట్స్ పై ఆధారపడి జీవించటం అసలు మంచిది కాదు. ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల శరీరానికి ఎక్కువ హాని జరుగుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిశోధన నివేదికలో వెల్లడించిన కొన్ని సప్లిమెంట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..

చాలామంది తొందరగా బరువు తగ్గటానికి సప్లిమెంట్స్ పై ఎక్కువగా ఆధారపడతారు. ఈ ఉత్పత్తులు అన్నీ కూడా వేరువేరు పదార్థాలను కలిగి ఉంటాయి. US ఏజెన్సీFDA ఇలాంటి సప్లిమెంట్స్ లను తీసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి సప్లిమెంట్స్ గుండె జబ్బుల ప్రమాదాలను కూడా పెంచుతాయి. ఒక్కొక్కసారి మరణానికి కూడా దారితీస్తుంది. చాలా మంది ఎనర్జీ లెవెల్స్ పెంచుకునేందుకు కూడా సప్లిమెంట్స్ వాడుతూ ఉంటారు. ఈ సప్లిమెంట్స్ కంటే కాఫీ మంచిది. ఈ సప్లిమెంట్స్ ఎక్కువ మోతాదులో శరీరంలోనికి ప్రవేశించినట్లయితే, అది కార్డియాక్ అరెస్ట్ తో సహా ఎన్నో గుండె సమస్యలకు కూడా దారితీస్తుంది.

Vitamins విటమిన్స్మినరల్స్ కోసం సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా ఈ సంచలన విషయం మీకోసమే

Vitamins : విటమిన్స్,మినరల్స్ కోసం సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా… ఈ సంచలన విషయం మీకోసమే…!

కాల్షియల్ సప్లిమెంట్స్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. మహిళలు ప్రతిరోజూ వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే వైద్యల సలహా మేరకే ఈ కాల్షియం సప్లిమెంట్స్ ను తీసుకోవాలి. ఈ సప్లిమెంట్స్ ను ఎక్కువ రోజులు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ సమస్యలు కూడా వస్తాయి. విటమిన్ ఇ సప్లిమెంట్స్ కూడా శరీరానికి అంత మంచివి కావు. ఈ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల బ్రెయిన్ హేమరైజ్ అనేది వస్తుంది. ఈ విటమిన్ సప్లిమెంట్స్ ఎక్కువ వినియోగం పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాలను కూడా పెంచుతుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది