Green Peas : శీతాకాలంలో పచ్చి బఠానీలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు ఎంతంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Green Peas : శీతాకాలంలో పచ్చి బఠానీలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు ఎంతంటే..?

Green Peas : పచ్చి బఠానీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.. చలికాలంలో మార్కెట్లో పచ్చిబఠానీ కాయలు అందుబాటులో ఉంటాయి. చలికాలంలో ఇవి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ ఏ సి మరియు ఒమేగా త్రీ ఫ్యాక్టరీ ఆసిడ్స్ మరియు మరికొన్ని ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గించడం నుండి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను క్రమబద్ధం చేసే గుణాలు ఉన్నాయి. మనకి ఎక్కువగా ఆకలి […]

 Authored By aruna | The Telugu News | Updated on :28 December 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Green Peas : శీతాకాలంలో పచ్చి బఠానీలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు ఎంతంటే..?

  •  పచ్చి బఠానీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు

Green Peas : పచ్చి బఠానీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.. చలికాలంలో మార్కెట్లో పచ్చిబఠానీ కాయలు అందుబాటులో ఉంటాయి. చలికాలంలో ఇవి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ ఏ సి మరియు ఒమేగా త్రీ ఫ్యాక్టరీ ఆసిడ్స్ మరియు మరికొన్ని ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గించడం నుండి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను క్రమబద్ధం చేసే గుణాలు ఉన్నాయి. మనకి ఎక్కువగా ఆకలి అనిపించదు.. ఉడకబెట్టుకుని మాత్రమే కాకుండా అనేక రకాలుగా కూరలు, సూప్ చేసుకుని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

సన్నగా నాజుగా కనబడాలనుకునే వారు బఠానీలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. బఠానీలు ఆకుకూరలు, కూరగాయలతో కలిపి తీసుకుంటే విరేచనం సాఫీగా జరిగి మలబద్ధకం నుంచి విముక్తి పొందవచ్చు.. 100 గ్రాముల పచ్చి బఠానీలు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఇతర కూరగాయలతో కలిపి తీసుకుంటే ఆకలి త్వరగా వెయ్యదు. బరువు కూడా పేరకుండా ఉంటారు. బఠానీలలో ప్రోటీన్ ఫైబర్ ఐరన్ మరియు ఏ,కే,సి మొదలగు విటమిన్స్ ఉంటాయి. ప్రోటీన్ బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది. విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో ఉపయోగపడతాయి.

డయాబెటిక్ రోగులు తప్పనిసరిగా బఠానీలను తీసుకోవాలి. బఠానీలను ఉడికించి ముద్దలా చేసి ఎదుగుతున్న పిల్లలకు బలహీనంగా ఉన్నవారికి ఇస్తే మనోవర్ధక ఆహారంగా అందించినట్లు అవుతుంది. వారికి ఇవి బాగా పనిచేస్తాయి. వీటిలో ఆంటీ ఇన్ఫర్మేషన్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనలో తెలిసింది. మెగ్నీషియం, పొటాషియం గుండెకు ఎంతో మేలు చేస్తాయి.వీటిని తినడం వల్ల బీపీని కంట్రోల్ లో ఉంచవచ్చు. అయితే రాత్రిపూట మాంసాహారంతో మసాలా దినుసులుతో వీటిని చాలా తక్కువగా తీసుకుంటే మంచిది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది