Electric Heater : ఎలక్ట్రిక్ హీటర్ ను ఎక్కువగా వాడుతున్నారా… జాగ్రత్త… సమస్యల్లో పడ్డట్టే…!
ప్రధానాంశాలు:
Electric Heater : ఎలక్ట్రిక్ హీటర్ ను ఎక్కువగా వాడుతున్నారా... జాగ్రత్త... సమస్యల్లో పడ్డట్టే...!
Electric Heater : వర్షాకాలం మొదలైంది. ఈ కాలం వచ్చింది అంటే చాలు ఇంట్లో బయట తడిగా ఉండటంతో ఎంతో ఇబ్బంది పడతాం. రోజు మొత్తం కురుస్తున్న ఈ వర్షంతో స్కూల్ కెళ్లేవారు మరియు కాలేజీకి వెళ్లే విద్యార్థులు,ఉద్యోగులతో సహా ఎన్నో అవస్థలు పడాల్సి ఉంటుంది. ఇక ఉదయం స్నానం చేయాలి అంటే చాలా చలిగా ఉంటుంది. అంతేకాక ఇంట్లో ట్యాప్ నుండి వచ్చే వాటర్ కూడా ఎంతో చల్లగా ఉంటాయి. దీంతో వేడి నీటితో స్నానం చేస్తారు. అయితే ఈ వేడి నీళ్ల కోసం కొంతమంది గ్లిజర్ వాడితే,మరి కొంతమంది గ్యాస్ స్టవ్ వాడుతారు. ఇంకొంతమంది అయితే హీటర్ వాడతారు. అయితే వీటిలో అన్నింటికంటే ఎక్కువగా హీటర్ ను వాడుతున్నారు. ఈ హీటర్ అనేది అందరికీ అందుబాటులో దొరుకుతుంది. అంతేకాక చాలా తక్కువ టైంలో వాటర్ ను వేడి చేసుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ హీటర్ ను వాడడం వలన ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర నష్టాలు కూడా ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఈ ఎలక్ట్రిక్ హీటర్ ను వాడటం వలన నీళ్లు అనేవి తొందరగా వేడెక్కుతాయి. కానీ ఆ నీటితో స్నానం చేయటం వలన అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా హీటర్ తో వేడి చేసిన నీటితో స్నానం చేయటం వలన దురద, పొక్కులు మరియు ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అలాగే ఎలక్ట్రిక్ హీటర్ ను వాడేటప్పుడు గాలిలో కార్బన్ మోనాక్సైడ్ లాంటి ఎంతో హానికరమైన వాయువులు రిలీజ్ అవుతాయి అని అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ హీటర్ రిలీజ్ చేసే వాయువుల వలన తలనొప్పి, వికారం, శ్వాసకోశ సమస్యలు వస్తాయి అంటున్నారు. అంతేకాక హీటర్ తో బాగా వేడెక్కిన నీటితో స్నానం చేయడం వలన గుండె ఆరోగ్యం పై కూడా ఎంతో ప్రభావం పడుతుంది అని అంటున్నారు. దీంతో గుండెపోటు మరియు స్ట్రోక్ లాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు…
ఈ ఎలక్ట్రిక్ హీటర్ ను ఉపయోగించడం వలన ఆరోగ్య సమస్యలు మాత్రమే కాక ఆర్థిక సమస్యలు కూడా తప్పవు అని అంటున్నారు. ఎందుకు అంటే. ఎలక్ట్రిక్ హీటర్ పనిచేయాలి అంటే దానికి ఎంతో విద్యుత్తు అవసరం. దీని కారణం చేత కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాక కొన్ని హీటర్లైతే తరచుగా రిపేర్ కి వస్తూ ఉంటాయి. దీనివలన వాటిని బాగు చేయించాలన్న లేక కొత్త వాటిని కొనాలన్న ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతే కాకుండా నాణ్యత లేని హీటర్ ను వాడడం వలన ప్రమాదాలు జరిగే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కావున మీరు తప్పనిసరి పరిస్థితుల్లో హీటర్ ను ఉపయోగించాలి అనుకుంటే కాస్త ధర ఎక్కువైనా మంచి క్వాలిటీ చూసి తీసుకోండి. మంచి క్వాలిటీ హీటర్ బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు…