Health Benefits : అరటి పువ్వుతో అద్భుతమైన లాభాలు.. మధుమేహులకు మరీనూ!
Health Benefits : ప్రస్తుత కాలంలో చాలా మందికి మధుమేహం వస్తోంది. అయితే ఈ సమస్యకు శాశ్వత నివారణ లేదు. కేవలం మెరుగైన ఆహారం ద్వారా మాత్రమే దీన్ని నియంత్రించవచ్చు. వ్యాయామం చేయడం, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వంటి సాధారణ జీవనశైలి మార్పులు రక్తంలో చక్కెరను నియంత్రించ గలవని నిపుణులు అంగీకరిస్తున్నారు. మధుమేహం కారణంగా రోగి రక్తంలో చక్కెర పెరగడం ప్రారంభం అవుతుంది. ఇది అనేక ప్రాణాంతక సమస్యలకు దారి తీస్తుంది. మెరుగైన జీవితాన్ని గడపాలంటే ఉషగర్ పేషెంట్లను అదుపులో ఉంచుకోవాలి. చక్కెర కోసం అనేక రకాల మందులు ఉన్నాయి. అయితే దీని కోసం మీరు కన్ని ఇంటి లేదా ఆయుర్వేద నివారణలను కూడా వాడవచ్చు.
అరటి పువ్వు మధమేహాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో భాస్వరం, కాల్షియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. వీటిని సలాడ్లు, సూప్ లు సాధారణ ఆహారంలో చేర్చవచ్చు. అరటి పువ్వు ప్రయోజనాల గురించి ఒక్కసారి తెలుసుకుందాం. అరటి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ప్రోటీన్లతో సహా అనే పోషకాలు ఉంటాయి. యీఎస్డీఏ ప్రకారం.. 3.5 ఔన్సు అరటి పువ్వులో 23 గ్రాముల కేలరీలు, 4 గ్రాముల పిండి పదార్థాలు, 1.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ ఖనిజాలు మీ శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. అయితే వీటిలో కేలరీలు తక్కువగా ఉండి.. ఫైబర్ అధికంగా ఉంటుంది.
ఇలాగే ఇందులో ఉండే కరిగే ఫైబర్ వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుందట. అరటి పువ్వులు మీ శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను కల్గి ఉంటాయి. అరటి పండు, ఇతర ఉష్ణ మండల పండ్ల కంటే ఇది తక్కువ సహజ చక్కెరను కల్గి ఉండం.. దీని అతిపెద్ద లక్షణం. అందుకే ఇది మధుమేహులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అరటి పువ్వులో ఉండే కరిగే, కరగని ఫబైర్ మానవ జీర్ణ వ్యవస్థకు ఎంతగానో ఉపయోగపడతాయి. పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగల గట్ మైక్రోబయోమ్ ను ఫైబర్ తీసుకోవడం మెరుగుపరుస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే అరటి పువ్వు పొడిని ఆహారం ద్వారా తీసుకున్న వారిలో.. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినట్లుగా నిపుణులు గుర్తించారు.