Beauty Tips : మంగు మచ్చలు తొలగిపోవాలంటే… నిమ్మకాయలో దీన్ని కలిపి ఫేస్ కి రాయండి…
Beauty Tips : చాలామంది ముఖంపై ఎటువంటి మచ్చలు లేకుండా చూసుకుంటారు. అలాగే మచ్చలు లేకుండా ముఖం అందంగా, తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటారు. దీనికోసం వివిధ రకాల ట్రీట్ మెంట్ లను తీసుకుంటూ ఉంటారు. పార్లర్ కి వెళ్లి వేలవేల డబ్బులను వృధా చేస్తారు. అయినా ఫేస్ లో ఎటువంటి మార్పు రాదు. ముఖం మీద నల్ల మచ్చలు, మంగు మచ్చలు లాంటివి ఉంటే ఫేస్ అందంగా కనబడదు. అలాగే కొందరిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. ఇప్పుడు చాలామంది మంగు మచ్చలతో బాధపడుతున్నవారు వీటిని తగ్గించడం కోసం వివిధ రకాల ఆయింట్ మెంట్ లను రాస్తూ ఉంటారు. అయినా ఆ మచ్చలు అనేవి ముఖంలో నుంచి తొలగిపోవు. అయితే మీరు కనుక ఈ చిట్కాను అనుసరించినట్లయితే ముఖంలో మంగు మచ్చలను సులువుగా తొలగించుకోవచ్చు. అయితే ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మంగు మచ్చల సమస్య తొలగిపోవాలంటే మన ఇంటిలోనే ఒక చక్కటి పరిష్కారం ఉంది. మన వంటింట్లో ఉండే వస్తువులతో ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు. సాధారణంగా ఈ మంగు మచ్చలు అనేవి ఎక్కువగా బుగ్గలు, ముక్కుకు ఇరువైపులా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మెడ, భుజాలు, వీపు మీద కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి. ముఖంపై ఈ మచ్చలు ఉండడం వలన అందంగా ఉండేవారు కూడా అందహీనంగా కనిపిస్తారు.ఈ మచ్చలకి సాధారణ మచ్చలను తగ్గించే చిట్కాలను పాటిస్తే సరిపోదు. దీనికి మనం ఎప్పుడూ ఉపయోగించని చిట్కాను ఉపయోగించాలి. ఈ మచ్చలను తగ్గించడానికి నిమ్మరసం, పాలు చాలా బాగా సహాయపడతాయి. అయితే వీటితో ఫేస్ కి చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పాలు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని మంగు మచ్చలు ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా రాసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు స్మూత్ గా మసాజ్ చేయాలి. తరువాత అరగంట అయ్యాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రంగా ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మంగు మచ్చలు అనేవి తొలగిపోతాయి. నిమ్మరసంలో ఉండే బ్లీచింగ్ లక్షణాలు మచ్చలను తగ్గించి ముఖం తెల్లగా మెరిసేలా చేస్తుంది. నిమ్మరసం మనకు ఇంటిలో సులువుగా దొరుకుతుంది. అలాగే పాలను ప్రతిరోజు వాడుతుంటాం. పాలలో ఉండే పోషకాలు ఈ మచ్చలను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. కాస్త సమయాన్ని కేటాయిస్తే ఎటువంటి ఖర్చు లేకుండా సులువుగా మంగు మచ్చల సమస్య నుంచి బయటపడవచ్చు.