Beauty Tips : ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలంటే… కాఫీ పొడితో ఈ చిట్కాను ట్రై చేయండి… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండాలంటే… కాఫీ పొడితో ఈ చిట్కాను ట్రై చేయండి…

 Authored By aruna | The Telugu News | Updated on :1 September 2022,6:30 am

Beauty Tips : ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం వలన అలాగే జీవనశైలిలో వచ్చిన మార్పుల వలన ఆహారపు అలవాట్లు మారడం వలన చర్మంపై ముడతలు రావడం, చిన్న వయసులోని ముసలి వారిలాగా కనిపించడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికోసం కొందరు పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల వేల డబ్బులను వృధా చేస్తుంటారు. కానీ ఎటువంటి లాభం ఉండదు. అంతేకాకుండా అవి కొన్ని రోజులు మాత్రమే పని చేస్తాయి. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా వీటి వలన మన భవిష్యత్తులో కూడా చాలా నష్టాలు కలిగే అవకాశం ఉంది.

కాబట్టి ఇప్పుడు చెప్పుకునే చిట్కాను ఉపయోగిస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కలుగుతుంది. ఈ చిట్కాను ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా ఏదైనా కాపీ పౌడర్ తీసుకోవాలి. కాఫీ పౌడర్ మన కు లోపలికి మంచిది కాదు కానీ బాహ్యంగా ఉపయోగించవచ్చు. తర్వాత నాలుగు లేదా ఐదు నాటు టమాటాలను తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమంలో ఒక స్పూన్ కాఫీ పౌడర్ ను కలిపి మన చర్మం ఎక్కడైతే వదులుగా ఉందో అక్కడ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న అరగంటసేపు ఆరనివ్వాలి.

Beauty Tips With Coffee Powder To Be Always Young

Beauty Tips With Coffee Powder To Be Always Young

ఇలా చేయడం వలన ప్యాక్ డ్రై అయి చర్మం మొత్తం బిగుతుగా అవుతుంది. ఆ తర్వాత నీటితో స్నానం చేయాలి. కాఫీ పౌడర్ ని ఉపయోగించడం వలన చర్మం బిగుతుగా అవడంతో పాటు చర్మం యొక్క తేజస్సు కూడా పెరుగుతుంది. టమాటలో ఉండే విటమిన్ సి చర్మంపై ఉన్న మృత కణాలు తొలగించబడతాయి. అంతేకాకుండా చర్మం యొక్క మెరుపును పెంచుతుంది. మరి చర్మం బిగుతుగా అవడంతో సహాయపడుతుంది. కనుక ఇటువంటి నేచురల్ ప్యాక్ ను ఉపయోగించడం వలన యవ్వనంగా కనిపిస్తారు. ఈ ప్యాక్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కనుక ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది