Nutmeg Powder Water : జాజికాయ నీటిని నిత్యం తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nutmeg Powder Water : జాజికాయ నీటిని నిత్యం తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

Nutmeg Powder Water : జాజికాయ అనేది ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసు అని చెప్పవచ్చు. అలాగే దీనిని ఇతర రకాల ఔషధాలలో కూడా ఎక్కువగా వాడతారు. దీనిని ఆయుర్వేద ప్రకారంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. అంతేకాక ఈ జాజికాయలో యాంటీ బయోటిక్ మరియు యాంటీ ధర్మబోటిక్ లాంటివి సమృద్ధిగా ఉన్నాయి. అలాగే వీటిలో పొటాషియం, కాల్షియం,ఐరన్, జింక్,మెగ్నీషియం, కాపర్ లాంటివి కూడా ఎంతో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎన్నో రకాల […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 August 2024,12:00 pm

Nutmeg Powder Water : జాజికాయ అనేది ప్రతి ఒక్కరి వంట గదిలో ఉండే మసాలా దినుసు అని చెప్పవచ్చు. అలాగే దీనిని ఇతర రకాల ఔషధాలలో కూడా ఎక్కువగా వాడతారు. దీనిని ఆయుర్వేద ప్రకారంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. అంతేకాక ఈ జాజికాయలో యాంటీ బయోటిక్ మరియు యాంటీ ధర్మబోటిక్ లాంటివి సమృద్ధిగా ఉన్నాయి. అలాగే వీటిలో పొటాషియం, కాల్షియం,ఐరన్, జింక్,మెగ్నీషియం, కాపర్ లాంటివి కూడా ఎంతో సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఎన్నో రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి. అయితే ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నటువంటి ఈ జాజికాయ నీటిని తీసుకోవటం వలన మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.

జాజికాయ నీటిని నిత్యం ఖచ్చితంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాక ఒక గ్లాస్ జాజికాయ నీటిని తీసుకోవడం వలన జీర్ణక్రియ కు కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే కడుపు అసౌకర్యం కూడా దూరం అవుతుంది. అంతేకాక పంటికి సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా తగ్గిస్తుంది. అలాగే పంటి నొప్పితో బాధపడే వారికి కూడా ఈ జాజికాయ మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. అలాగే నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది. అయితే ఈ జాజికాయతో నిద్రలేమి సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే అధిక ఒత్తిడి మరియు బిజీ లైఫ్ కారణం గా ఎంతో మంది నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ జాజికాయ తీసుకోవడం వల్ల నిద్ర కూడా బాగా పడుతుంది అని నిపుణులు అంటున్నారు.

Nutmeg Powder Water జాజికాయ నీటిని నిత్యం తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

Nutmeg Powder Water : జాజికాయ నీటిని నిత్యం తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

ఈ జాజికాయలో ఉన్నటువంటి ఔషధ గుణాలు గుండెకు కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాగే కాల్షియం,పొటాషియం, మెగ్నీషియం కూడా దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఈ జాజీకాయను ఉపయోగించటం వలన గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అయితే గుండెకు సంబంధించిన ఇతర రకాల సమస్యలు రాకుండా కూడా చేస్తుంది. ఈ జాజికాయను మన ఆహారంలో చేర్చుకోవడం వలన రక్తంలో షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అయితే ఈ జాజికాయలో యాంటీ ఇన్ఫ్లోమెంటరీ మరియు యాంటీ మైక్రోబ్యాక్టీరియల్ గుణాలు కూడా ఎంతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంపై వచ్చే దురద మరియు మంటను కూడా నియంత్రిస్తుంది. అలాగే జాజికాయ యక్నె నియంత్రించడానికి కూడా ఎంతో బాగా మేలు చేస్తుంది. అంతేకాక ముఖం పై ఏర్పడే మచ్చలు మరియు గీతలను కూడా తగ్గిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ర్యూమాటిజం లాంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా చూస్తుంది. దీనితో మెదడు ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. దీనిలో ఉండే పొటాషియం, మెగ్నిషియం, ఐరన్ వల్ల అభిజ్ఞ పని తీరు కూడా ఎంతగానో మెరుగుపడుతుంది. అలాగే అధిక ఒత్తిడితో బాధపడే వారికి కూడా నిత్య ఈ జాజికాయ నీటిని తీసుకోవడం వల్ల స్ట్రెస్ నుండి ఉపశమనాన్ని పొందవచ్చు…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది