Avocado : ఈ విదేశీ పండుతో ఎన్ని ప్రయోజనాలో… ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం…!
ప్రధానాంశాలు:
Avocado : ఈ విదేశీ పండుతో ఎన్ని ప్రయోజనాలో... ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం...!
Avocado : ప్రకృతిలో సహజంగా లభించే పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలుసు. అందుకే పండ్లను ప్రకృతి ప్రసాదించిన అపూర్వకమైన వరంగా భావిస్తుంటారు. అలాగే కొన్ని సీజన్స్ లో పండే కొన్ని రకాల పండ్లను తప్పనిసరిగా తినాలని చిన్నప్పటినుండి మనం పెద్దలు చెబుతుంటే విన్నాం. అలాగే వైద్య నిపుణులు కూడా ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో విదేశీ పండ్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వాటి వలన కలిగే ప్రయోజనాలు కూడా ఎక్కువే. అందుకే ప్రస్తుత కాలంలో విదేశీ పండ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక అలాంటి పండ్లలో అవకాడో పండు కూడా ఒకటి. ఇక ఈ అవకాడో పండును అత్యంత ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటిగా వైద్య నిపుణులు చెబుతుంటారు. ఇక ఈ అవకాడో పండు రక్తపోటును తగ్గించడం,బరువు తగ్గించటం , అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాక అవకాడోను సలాడ్లు ,టోస్ట్ ,స్మూతీస్ వంటి వివిధ రకాల వంటకాలలో కూడా ఉపయోగిస్తుంటారు. మరి ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగి ఉన్న ఆవకాడో పండు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Avocado : బరువు తగ్గించడానికి…
అవకాడో పండులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణ క్రియ మరియు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది.అలాగే జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గించడానికి ఇది చక్కటి ఔషధం.
Avocado : న్యూట్రీషియన్ రిచ్…
అవకాడో లో న్యూట్రీషియన్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. దీనిలో ఉండే మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడతాయి.
Avocado : చర్మం జుట్టు ఆరోగ్యం…
చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఆవకాడో పండు ఎంతగానో సహాయపడుతుంది. ఈ పండులో ఉండే పోలేట్ విటమిన్ ఇ వంటి పోషకాలు జుట్టును బలంగా ఉంచేందుకు తోడ్పడతాయి.

Avocado : ఈ విదేశీ పండుతో ఎన్ని ప్రయోజనాలో… ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం…!
Avocado : చక్కెర స్థాయిలను నియంత్రించడానికి…
అవకాడో పండులో పోషకాలు మరియు ఫైబర్ కంటెంట్ పుష్పాలంగా ఉండటం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రంచడానికి ఎంతగానో సహయపడుతుంది. అంతేకాక దీనిలో క్యాలరీలు తక్కువగా ఉండటం వలన డైటింగ్ చేసే వారికి ఇది మంచి ఆహారమని చెప్పవచ్చు.
Avocado : కంటి ఆరోగ్యం…
అవకాడో పండులో లూటీన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. తద్వారా కంటి శుక్లం ఇతర కంటి వ్యాధుల ప్రమాదానికి తక్కువగా గురవుతారని వైద్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు. అంతేకాక ఈ పండు ప్రతిరోజు తినడం వలన వయసు సంబంధిత దృష్టి సమస్యల నుండి కూడా రక్షిస్తుంది.
గమనిక : పైన పేర్కొనబడిన కథనాన్ని ఇంటర్నెట్ లో దొరికే సమాచారం ఆధారంగా రూపొందించడం జరిగింది. ది తెలుగు న్యూస్ దీనిని ధ్రువీకరించలేదు.