Avocado : ఈ అద్భుతమైన పండు రోజు ఒకటి తింటే చాలు… ఇక ఆస్పటల్ కి వెళ్ళవలసిన అవసరమే రాదు..!
ప్రధానాంశాలు:
Avocado : ఈ అద్భుతమైన పండు రోజు ఒకటి తింటే చాలు... ఇక ఆస్పటల్ కి వెళ్ళవలసిన అవసరమే రాదు..!
Avocado : ఏ సీజన్లో పండ్లు ఆ సీజన్లో తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే పండ్లు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు పండ్లు తినాలని నిపుణులు చెప్తుంటారు. అయితే సీజనల్ పండ్లలో అవకాడో ఒక అద్భుతమైన పండు అవకాడోలో చాలా పోషకాలు ఉంటాయి. ఇది అధిక కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు ఏ, బి, ఈ ఫైబర్ కనిజాలు ప్రోటీన్లతో సహా అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఇది ఎన్నో వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఇది రుచికరమైన పోషకమైన పండు అవకాడో మన జుట్టు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది మధుమేహం, క్యాన్సర్, అజీర్ణం డయేరియా లాంటి వ్యాధుల నుండి విముక్తిని కలిగించడానికి దోహదపడుతుంది. అవకాడో పండుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం..
చర్మ సమస్యలు తగ్గించడానికి; యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉండే ఈ అవకాడో తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవకాడో అనేక చర్మ సంబంధించిన సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
క్యాన్సర్ కు చెక్ పెడుతుంది
ప్రోస్టేడ్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి అవకాడో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మోనోశాచిరేటెడ్ కొవ్వు లో కెరోటి నాయుడులు తగినంతగా ఉంటాయి. ఇది క్యాన్సర్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అధిక రక్తపోటు నుంచి ఉపశమనం
అవకాడో ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది రక్తకణాలను నయం చేయడంలో ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: అవకాడో పండ్లలో ప్లేవనాయిడ్స్ సపోనేండ్లు టానింగ్లు అధికంగా ఉంటాయి. ఈ సమ్మేళనాల ఉపయోగంతో ఇది ఆసిడిటీ గ్యాస్ట్రిక్ సమస్యలు మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్
అవకాడో అధిక కొవ్వు తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారం తక్కువ కార్బోహైడ్రైడెడ్ కంటెంట్ కారణంగా ఇది బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. అవకాడో అనేది శక్తిని పెంచే ఆహారం.
ఆర్థరైటిస్ కు మేలు: ఆర్థరైటిస్ కు అవకాడో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇది మోకాళ్ల నొప్పులను కండరాల వాపును కణజాలం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.. ఎముకలను దృఢంగా మారుస్తుంది.