Camphor Water : ప్రతిరోజు కర్పూరం నీటితో స్నానం చేయడం వలన కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు…!
Camphor Water : కర్పూరం అనగానే ముందుగా మనకు దాని యొక్క వాసన గుర్తుకు వస్తుంది. అయితే కర్పూరం వెలిగించకుండా ఏ పూజ కార్యక్రమం కూడా పూర్తి కాదు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హారతి ఇచ్చేందుకు వాడే కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా మేలు చేస్తాయి అని నిపుణులు అంటున్నారు. ఈ కర్పూరం వాసన పిలిచిన సరే పలు రకాల […]
ప్రధానాంశాలు:
Camphor Water : ప్రతిరోజు కర్పూరం నీటితో స్నానం చేయడం వలన కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు...!
Camphor Water : కర్పూరం అనగానే ముందుగా మనకు దాని యొక్క వాసన గుర్తుకు వస్తుంది. అయితే కర్పూరం వెలిగించకుండా ఏ పూజ కార్యక్రమం కూడా పూర్తి కాదు అనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హారతి ఇచ్చేందుకు వాడే కర్పూరంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా మేలు చేస్తాయి అని నిపుణులు అంటున్నారు. ఈ కర్పూరం వాసన పిలిచిన సరే పలు రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని అంటున్నారు. అయితే కర్పూరం కలిపిన నీటితో స్నానం చేస్తే ఎన్నో లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అయితే మనం ప్రతిరోజు కర్పూరం కలిపినటువంటి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చమట సమస్యలతో బాగా ఇబ్బంది పడే వారికి కర్పూరం కలిపిన నీటితో స్నానం చేయడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుంది అని నిపుణులు అంటున్నారు. అయితే ఎటువంటి ఫర్ ఫ్యూమ్ లు వాడిన కొద్దిసేపు మాత్రమే వాటి ప్రభావం అనేది ఉంటుంది. అలా కాకుండా కర్పూరం కలిపిన నీటితో మీరు స్నానం చేయటం వల్ల ఆ రోజంతా కూడా మీరు ఎంతో తాజాగా ఉంటారు. అంతేకాక మీ శరీరం నుండి వచ్చే చెమట వాసన కూడా దూరం చేయడం లో ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియాల్ మరియు యాంటీబయోటిక్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మానికి సంబంధించిన సమస్యలను కూడా అడ్డుకుంటుంది.
ముఖ్యంగా చెప్పాలి అంటే చర్మంపై వచ్చే దురద మరియు దద్దుర్లు, మొటిమలు లాంటి సమస్యలను కూడా నయం చేస్తుంది. అంతేకాక చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. ముఖానికి సహజ సౌందర్యం కూడా అందిస్తుంది. అలాగే మానసిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి కూడా కర్పూరం వాసన ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒత్తిడితో సతమతం అయ్యే వారు స్నానం చేసేటప్పుడు ఈ కర్పూరం కలుపుకొని చేయాలి అని అంటున్నారు. దీంతో ఒత్తిడి దూరమే శరీరానికి రిఫ్రిష్ అనేది వస్తుంది. అలాగే తలనొప్పి మరియు వెన్ను నొప్పితో పాటుగా ఇతర నొప్పులన్నిటిని కూడా ఈ కర్పూరం బెస్ట్ రెమెడీ గా పని చేస్తుంది. అంతేకాక ఒంటి నొప్పులను కూడా దూరం చేస్తుంది. అలాగే మీరు ఆ రోజంతా యాక్టివ్ గా ఉండడంలో కూడా ఇది ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది…