Raisin Water : ఎండు ద్రాక్షాను నీటిలో మరిగించి తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Raisin Water : ఎండు ద్రాక్షాను నీటిలో మరిగించి తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

Raisin Water : ప్రస్తుతం చాలా మంది తమ ఆరోగ్యం కోసం తమ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ కూడా బాగం చేసుకుంటున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఒకటి ఎండు ద్రాక్ష కూడా. అయితే ఈ ఎండు ద్రాక్షాలో ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫైబర్,మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. కావున ఈ ఎండు ద్రాక్షతో మరిగించిన వాటర్ ను తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఎండు ద్రాక్షాలో విటమిన్లు మరియు ఖనిజాలకు ముఖ్య […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Raisin Water : ఎండు ద్రాక్షాను నీటిలో మరిగించి తీసుకుంటే... ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...!

Raisin Water : ప్రస్తుతం చాలా మంది తమ ఆరోగ్యం కోసం తమ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ కూడా బాగం చేసుకుంటున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ లో ఒకటి ఎండు ద్రాక్ష కూడా. అయితే ఈ ఎండు ద్రాక్షాలో ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫైబర్,మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. కావున ఈ ఎండు ద్రాక్షతో మరిగించిన వాటర్ ను తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ ఎండు ద్రాక్షాలో విటమిన్లు మరియు ఖనిజాలకు ముఖ్య ములం అని చెప్పొచ్చు. అయితే ఈ ఎండు ద్రాక్ష తో మరిగించిన నీటిని తీసుకోవటం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. ఈ ఎండు ద్రాక్షలో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. అయితే ఈ ఎండు ద్రాక్ష నీటిని తీసుకోవటం వలన మలబద్ధక సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే జీర్ణ క్రియను కూడా ఎంతో మెరుగుపరుస్తుంది. దీనిలో ఉన్న గట్ ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే కాలేయం నుండి విషాన్ని బయటకు పంపించడంలో కూడా మేలు చేస్తుంది.

ఈ ఎండు ద్రాక్ష నీటిని తీసుకోవటం వలన కాలేయం నుండి టాక్సిన్స్ బయటకు వెళ్లకుండా చేస్తాయి. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఎండు ద్రాక్ష నీటిని తీసుకోవటం వలన శరీరానికి వెంటనే శక్తిని ఇస్తుంది. అయితే ఎండు ద్రాక్షతో మరిగించినటువంటి నీరు ఐరన్ కు మంచి మూలం అని చెప్పొచ్చు. కావున రక్తహీనత రాకుండా ఉండాలి అంటే ఈ ఎండు ద్రాక్ష నీటిని తీసుకోవటం మంచిది. ఈ ఎండు ద్రాక్ష వీటిని తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి అనేది వస్తుంది. వీటిలో ఉండే విటమిన్స్ ఇతర యాంటీ ఆక్సిడెంట్ లు ఉండడం తో ఎండు ద్రాక్ష నీటిని తీసుకోవటం వలన రోగనిరోధక శక్తిని ఎంతగానో పెంచుతుంది. ఈ ఎండు ద్రాక్షలో ఉన్న పీచ్ ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో కూడా మేలు చేస్తుంది. అలాగే గుండె పై ఒత్తిడిని కూడా నియంత్రిస్తుంది…

Raisin Water ఎండు ద్రాక్షాను నీటిలో మరిగించి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

Raisin Water : ఎండు ద్రాక్షాను నీటిలో మరిగించి తీసుకుంటే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

ఈ ఎండు ద్రాక్ష పొటాషియం కు మంచి మూలం అని చెప్పొచ్చు. కావున ఈ ఎండుద్రాక్ష నీటిని తీసుకోవటం వలన రక్తపోటును నియంత్రించడానికి మరియు గుండె సమస్యల ప్రమాదాలను తగ్గించడానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ ఎండు ద్రాక్ష నీటిని తీసుకోవటం వలన ఎముకల ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. ఈ ఎండు ద్రాక్షలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండు ద్రాక్షతో మరిగించినటువంటి నీటిని తీసుకోవటం వలన అనవసరమైన కొవ్వు ను బయటకు పంపిస్తుంది. అయితే ఉదయం పరిగడుపున ఈ నీటిని తీసుకోవటం వలన కడుపు ఉబ్బరం మరియు బరువు ను నియంత్రించవచ్చు. అయితే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఎండు ద్రాక్ష రసం తాగటం వల్ల చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది