Best Tea : పరిగడుపున ఈ టీ తాగితే ఎసిడిటీ, తలనొప్పి, బిపి, కొలెస్ట్రాల్ ఏమీ దరి చేరవు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Best Tea : పరిగడుపున ఈ టీ తాగితే ఎసిడిటీ, తలనొప్పి, బిపి, కొలెస్ట్రాల్ ఏమీ దరి చేరవు..!

 Authored By aruna | The Telugu News | Updated on :18 January 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Best Tea : పరిగడుపున ఈ టీ తాగితే ఎసిడిటీ, తలనొప్పి, బిపి, కొలెస్ట్రాల్ ఏమీ దరి చేరవు..!

Best Tea : మనలో చాలామందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిని తగ్గించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపసమనం పొందడానికి ,పనివత్తిడి తగ్గించుకోవడానికి చాలా మంది టీ తాగుతూ ఉంటారు. అయితే మామూలుగా మనం చక్కెరతో తయారు చేస్తూ ఉంటాం.. చెక్కర టీ తాగడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు.ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మనం చక్కటి ఈ విధంగా తాగొచ్చు.. అది బెల్లం టీ.మనకు మానసిక ఆనందాన్ని ఇచ్చే ఈ టి బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. బెల్లం టీం తాగడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందవచ్చు.

పాలు విరగకుండా రుచిగా ఈ బెల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. తయారీకి కావలసిన పదార్థాలు బెల్లం తురుము నాలుగు టీ స్పూన్లు, కచ్చాపచ్చాగా దంచిన అల్లం ముక్కలు కొద్దిగా, కచ్చాపచ్చా దంచిన యలుకులు నాలుగు కావాలి. పాలు రెండు గ్లాసులు, నీళ్లు రెండు గ్లాసులు టీ పౌడర్ మూడు టీ స్పూన్లు.. ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి వేడి చేయాలి.ఇందులోనే టీ పౌడర్, బెల్లం తురుము యాలకులు, అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. డికాషన్ మరిగిన తర్వాత అందులో పాలను పోసి మరికొద్దిసేపు మరిగించాలి. తర్వాత ఈటీ ను వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లంటి తయారవుతుంది.

ఇది చాలా రుచిగా ఉంటుంది.రుచి తో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బెల్లం టీం తాగడం వల్ల రక్తహీనత సమస్య దూరం అవుతుంది. ఉదయం పూట తాగడం వల్ల మలబద్దక సమస్య నివారించబడుతుంది. రక్తపోటుతో బాధపడేవారు బెల్లం టీం తాగడం వల్ల చక్కటి ఫలితాలు పొందవచ్చు.. ఇందులో అల్లం, మిరియాలు వేసి తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు బారిన పడకుండా ఉంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా ఈ టీ ను నిర్భయంగా తాగవచ్చు. ఈ విధంగా బెల్లం టీం తయారు చేసుకొని తాగడం వల్ల రుచి తో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది