Gastric Problems : కడుపులో గ్యాస్, మంటతో ఇబ్బంది పడుతున్నారా..?ఇలా చేస్తే క్షణాల్లో మాయం…!
ప్రధానాంశాలు:
Gastric Problems : కడుపులో గ్యాస్, మంటతో ఇబ్బంది పడుతున్నారా..?ఇలా చేస్తే క్షణాల్లో మాయం...!
Gastric Problems : ప్రస్తుతం చాలామంది గ్యాస్ సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.. దీనికి కారణం సరియైన ఆహారం తీసుకోకపోవడం. ఆహారాన్ని సరియైన సమయంలో తీసుకోకపోవడం గ్యాస్ సమస్యలు రావడానికి కారణం అవుతున్నాయి. ఇలాంటి సమస్యలు అనేవి సాధారణంగా మారిపోతున్నాయి. ఇప్పుడు గ్యాస్, ఎస్టిడి సమస్య ప్రతి ఇద్దరిలోనూ కనిపిస్తున్నాయి. దానిని ఎదుర్కొంటున్న వ్యక్తి మాత్రమే ఈ సమస్యను అర్థం చేసుకోగలడు. గ్యాస్ సమస్య లేనివారికి ఈ బాధ ఏంటో అర్థం కాదు. దానితో ఇబ్బంది పడే వారికి మాత్రమే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మసాలా, వేపుడు, కారం, ఆహారాన్ని తీసుకోవడం వలన లేదా ఇంకా ఏదైనా కారణం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు… ఎసిడిటీ వలన కడపలో గ్యాస్ సమస్య వస్తుంది.
దీనికి కారణంగా తలనొప్పి ,కడుపునొప్పి కడుపులో మంట లాంటి సమస్యలు తో ఇబ్బంది పడవలసి ఉంటుంది.. ఇలాంటి సమయాలలో గ్యాస్ కు సంబంధించిన టాబ్లెట్స్ వేసుకోవడం అసలే మంచిది కాదు. అలా అని తీసుకోకుండా ఉండలేము. అయితే సాధ్యమైనంతవరకు ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలను వాడవచ్చు. మన వంటింట్లో ఉండే అనేక రకాల పానీయాలతో ఈ గ్యాస్ సమస్య నుంచి బయటపడడానికి ఉపయోగపడతాయి. అయితే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం…
గ్యాస్ ఎసిడిటీ కి నివారణ టిప్స్.
వాము పానీయం: వాము పానీయం తాగడం వలన మీరు గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు.. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ వాము వేసి మరిగించి త్రాగడం వలన ఈ గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు.
చల్లని పాలు: గ్యాస్ సమస్య ఉంటే చల్లని పాలు తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఎసిడిటీ సమస్య వస్తే దానిలో పంచదార లేదా ఉప్పు వంటి వాటిని వాడకూడదు
మజ్జిగ: ఎస్డిటి గ్యాస్ సమస్య వస్తే మజ్జిగ కూడా తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వలన కడుపులో మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంట్లోనే మజ్జిగ తయారు చేసుకొని తాగితే చాలు. ఈ గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు…
ఇంగువ: గ్యాస్ ప్రభావాలను తగ్గించడానికి ఇంగువ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. దీని వలన మీరు ఇంగువ నీటిని తీసుకోవచ్చు. అసిడిటీ సమస్య ఉన్నవారు కూరలు ఉండేటప్పుడు ఇంగువ వినియోగించడం చాలా మంచిది..
నిమ్మరసం: గ్యాస్ ఎసిడిటీ సమస్యలు వస్తే నిమ్మరసంలో సోడా, బ్లాక్ సాల్ట్ కలిపిన నీటిని తాగినట్లయితే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు..