Better Gut Health : మీ నోటిని శుభ్రంగా ఉంచే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే…ఈ డేంజరస్ సమస్యలు తప్పవు…?
ప్రధానాంశాలు:
Better Gut Health : మీ నోటిని శుభ్రంగా ఉంచే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే...ఈ డేంజరస్ సమస్యలు తప్పవు...?
Better Gut Health : కాలంలో చాలామంది ఉదయం పళ్ళు తోముకునే విషయంలో చాలా నిర్లక్ష్యతను వహిస్తారు. పళ్ళు సరిగ్గా తోమరు. నోరు శుభ్రంగా ఉండక అనేక అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. నోటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి.నిర్లక్ష్యం తగదు. ప్రతిరోజు మీరు తీసుకునే ఆహారం, మొదట మీ నోటి ద్వారానే వెళుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. అయితే,మీరు ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది మొదట మెట్టు. శుభ్రత కేవలం దంతాల రక్షణకు కాదు, పేగుల ఆరోగ్యానికి కూడా కీలక పాత్రను పోషిస్తుంది. ప్రతిరోజు సరైన దంత సంరక్షణ అలవాటు పాటిస్తే మీ జీవిత రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. చాలామంది కూడా గట్ హెల్త్ గురించి మాట్లాడేటప్పుడు, ప్రోబయోటిక్స్ ఫైబర్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ వంటి వాటిపై దృష్టి పెడతారు. కానీ,జీర్ణ క్రియ మన నోటిలోనే మొదలవుతుంది అనే విషయం చాలామందికి గుర్తుండదు. కేవలం ఆహారాన్ని ప్రవేశింపజేసే ద్వారం మాత్రమే కాదు, వ్యవస్థకు రోగనిరోధక శక్తికి మొదటిగా రక్షణ గోడలా ఉంటుంది.
Better Gut Health : మీ నోటిని శుభ్రంగా ఉంచే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే…ఈ డేంజరస్ సమస్యలు తప్పవు…?
Better Gut Health నిర్లక్ష్యం చెయ్యొద్దు
నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం నేరుగా పేగుల ఆరోగ్యంపై పడుతుందని విషయం గుర్తుంచుకోవాలి. హానికర బ్యాక్టీరియా కేవలం దంతాలను పాడు చేయడమే కాదు, మీ పేగు లోపలికి ప్రయాణించి పేగులలో మైక్రోబయోను అసమతులితంగా మార్చగలవు.
ఆరోగ్య సమస్యలు : నోటి లోపల పెరిగే చెడు బ్యాక్టీరియా రక్త ప్రవాహంలోకి చేరినప్పుడు, శరీరమంతటా దెబ్బతీసే ఇన్ఫలమేషన్ కు కారణం అవుతుంది. ముఖ్యంగా గట్టులో ఈ ఇన్ఫర్మేషన్ పెరిగితే.. జీర్ణక్రియలో గందరగోళం ఏర్పడుతుంది. అంతేకాకుండా,నోటిలో నొప్పి లేదా ఇన్ఫెక్షన్ల వల్ల తినే ఆహారం సరిగ్గా నమ్మలేకపోవడం.. కడుపు జీర్ణానికి ఆహారం పూర్తిగా సిద్ధంగా ఉండదు. వల్ల జీర్ణ క్రియ నెమ్మదిగా మారుతుంది.తద్వారా,శరీరం అవసరమైన పోషకాలను పూర్తిగా గ్రహించలేక పోతుంది.
నోటి అలవాట్లు : . పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే, ఆహారపు అలవాటులతో పాటు, నోటు శుభ్రతను కూడా పాటించాలి. ఈ చిన్న చిన్న మార్పులు దీర్ఘకాల ఆరోగ్యాన్ని నిర్ధారించగలవు.
. తగినంత నీళ్లు తాగటం మర్చిపోవద్దు. లాలాజల ఉత్పత్తి పెరిగే నోరు సహజంగా శుభ్రంగా ఉండేలా చేస్తుంది. ఇది ఆహారాన్ని ఏడ కొట్టడంలోనూ ఉపకరిస్తుంది.
. సహజ మూలికలతో తయారైన దంత సంరక్షణ ఉత్పత్తుల ఉపయోగించాలి. నిమ్మ, త్రిఫల, మిస్వాక్ అంటే, మూలికలు బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలను కలిగి ఉండి దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
. తీపి ప్రాసెస్ ఆహారాన్ని తగ్గించాలి. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు నోటిలో చెడు బ్యాక్టీరియాలను పెంచుతుంది. ఇది నోరు గట్టు రెండిటిని దెబ్బతీయగలదు.
. భోజనం చేసిన ప్రతిసారి నోటిని పుక్కిలించడం అలవాటు చేసుకోవాలి. ఆహారపు అవశేషాలు తొలగిపోవడమే కాకుండా,నోటిలో సహజ బ్యాక్టీరియా సమతువేతను నిలబెట్టడానికి ఇది సహాయపడుతుంది.
.పైబర్ పుష్కలంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినాలి.ఆపిల్, క్యారెట్,ఆకుకూర వంటి పదార్థాలు నోటి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఇంకా జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది.
ఆయుర్వేదం ఏం చెబుతుంది : ఆయుర్వేదం ప్రకారం.. నోటి ఆరోగ్యం, శరీరంలోని సంపూర్ణ ఆరోగ్యానికి మూలాధారంగా భావించబడుతుంది. లవంగం, దారుచిని, త్రీఫల,దానిమ్మ లాంటి వాటితో తయారయ్యే టూ పేస్టులు, కేవలం దంతాలను రక్షించడమే కాదు, శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాలను తొలగిస్తుంది. ఇవి చిగుళ్ల వాపును తగ్గిస్తుంది. నోటిని శుద్ధి చేస్తుంది. గట్టు క్లీనింగ్ లో కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
నోటి ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి : నోటిని శుభ్రంగా ఉంచే విషయంలో ఈ చిన్న విషయం అనుకోని నిర్లక్ష్యం చేయకూడదు. రోజువారి అలవాటు మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవనశలిలో తొలిమెట్టు. సహజ పదార్థాలతో తయారైన దంత సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించండి. సరైన నోటి శుభ్రత అలవాటును పాటిస్తే చిరునవ్వుతో పాటు,జీర్ణ క్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నోరు ఆరోగ్యంగా ఉంటే గట్టా ఆరోగ్య మెరుగుపడుతుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.