Gut Health : వీటిని తిన్నారంటే… మీ గట్ హెల్త్ బాగుంటుంది.. జీర్ణాశయానికి బెస్ట్ ఫుడ్…?
ప్రధానాంశాలు:
Gut Health : వీటిని తిన్నారంటే... మీ గట్ హెల్త్ బాగుంటుంది.. జీర్ణాశయానికి బెస్ట్ ఫుడ్...?
Gut Health :గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం. ప్రేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరంలో దాదాపు 70 శాతం రోగ నిరోధక శక్తి పెంచడానికి, పేగులే కేంద్రంగా ఉంటాయి. పేగుల ఆరోగ్యంగా ఉండడం మన శరీరం మొత్తానికి ఆరోగ్యంగా ఉంచటానికి బలమైన ఆధారం. శరీరం వ్యాధుల నుంచి తట్టుకోవాలన్నా,శక్తి పెరిగే ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ పొందాలన్నా పేగుల ఆరోగ్యం ముఖ్యం. మన శరీరంలోని జీర్ణ వ్యవస్థలో రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. దీనిలో బ్యాక్టీరియా,ఫంగస్, వైరస్ లాంటి జీవులు ఉంటాయి. సూక్ష్మజీవుల సముదాయాన్ని మైక్రోబయోమ్ పిలుస్తారు. దీని సమతుల్యత పేగు ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది బలహీనపడితే జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు మానసిక సమతుల్యతకు కూడా దారితీస్తుంది.

Gut Health : వీటిని తిన్నారంటే… మీ గట్ హెల్త్ బాగుంటుంది.. జీర్ణాశయానికి బెస్ట్ ఫుడ్…?
Gut Health గట్ హెల్త్
హెల్త్ ఆరోగ్యంగా ఉన్న పేగు ప్రతిదాని సమర్థంగా జీర్ణిస్తుంది. శక్తివంతమైన పోషకాలను శరీరానికి అందించుటకు, మలాన్ని బయటకు పూర్తిగా విసర్జించుటకు పంపే పనిలో కీలకంగా పని చేస్తుంది. అలాగే మన శరీరంలో హార్మోన్ల సమతుల్యతకు అవసరమైన సెరోటోనిన్ అనే నరాల రసాయనం కూడా పేగులే ఉత్పత్తి చేస్తాయి. అందుకే, పేగులను రెండవ మెదడు అని కూడా అంటారు. ఆరోగ్యం బాగా లేకపోతే,గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడేందుకు తినాల్సిన ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
పేగులు ఆరోగ్యంగా ఉండుటకు ఆరోగ్యకరమైన ఆహారం : పేగులుఆరోగ్యంగా ఉండుటకు, ముందు రోజు వండిన అన్నాన్ని నీటిలో నానబెట్టి రాత్రంతా ఉంచి మరునాడు తినాలి. ఇలా చేస్తే సహజంగా అన్నంలో ప్రోబయోటిక్స్ ఏర్పడతాయి. ఈ ఆహారంలో పేగులోని మంచి బ్యాక్టీరియాను పెంపొందించడానికి సహకరిస్తుంది. దీని తరచూ తీసుకుంటే పేగు వ్యవస్థ బలపడుతుంది.
మజ్జిగలో దాగిన ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి.
మజ్జిగ : ఈ మజ్జిగ పెరుగు నుంచి వెన్న తీసేసిన తర్వాత మిగిలేదే మజ్జిగ. జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే లాక్టోబాసీలస్ అనే బాక్టీరియా, మన పేగులకు ఆరోగ్యాన్ని అందిస్తుంది.ఇది శరీర వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది.
ఆరో రూట్ కంద : పసుపు రంగులో ఉండే ఒక రకమైన కందమూలం. ఈ ముద్దను కంజి లా తయారు చేసి తాగడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. తేలికగా జీర్ణమయ్యే పదార్థం కావడంతో పేగులు బలపడటానికి సహకరిస్తుంది. శరీరానికి తేలిగ్గా శక్తిని నింపుతుంది. ఈ మూడు ఆహారాలను మనం రోజువారి జీవితంలో భాగంగా చేసుకుంటే పేగులలో ఉన్న చెడు బ్యాక్టీరియా తగ్గి మంచి సూక్ష్మజీవులు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే పేగులు పూర్తిగా శుభ్రమవుతాయి.జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కాలికంగా చూస్తే ఇది శరీర ఆరోగ్యాన్ని మొత్తం మెరుగుపరిచే ప్రక్రియ. ఈ చిన్న మార్పులతో మన శరీరాన్ని,ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.