Bigg Boss 6 Telugu : ఇంట్లో నుండి దొబ్బేయండి అంటూ హౌజ్‌మేట్స్‌పై సీరియస్ అయిన బిగ్ బాస్
Bigg Boss 6 Telugu : ఈ సారి బిగ్ బాస్ సీజన్ 6 ఏకంగా 21 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభం కాగా,ఇందులోని కంటెస్టెంట్స్ చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే చేయడం లేదు. ఏదో తూతు మంత్రాన గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే గేమ్ మొదలై ఆరు వారాలు అవుతున్నా కూడా ఎవరు సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో ఒళ్లు మండిన బిగ్ బాస్ ఏకంగా టాస్క్ రద్దుచేసి ఒక్కొక్కరికి చీవాట్లు పెట్టాడు. ‘బిగ్ బాస్ హౌస్ చరిత్ర లోనే అతి నీరసంగా టాస్కులు చేస్తుండడం, బిగ్ బాస్ తో పాటు ప్రేక్షకులను కూడా లెక్కచెయ్యకుండా ఆడే కంటెస్టెంట్స్ ని మొట్టమొదటిసారి చూస్తున్నాను..
మీ నిర్లక్ష్యానికి శిక్షగా ఈ వారం కెప్టెన్సీ టాస్కుని రద్దు చేస్తున్నాను..ఈ వారం ఈ హౌస్ కి కెప్టెన్ ఉండదు. .ఎవరికైనా ఆడడం ఇష్టం లేకపోతే వెంటనే వెళ్లిపోవచ్చు’ అని బిగ్ బాస్ చాలా సీరియస్ గా మందలించాడు. అయితే అసలు ఈ టాస్క్ ఆగడానికి ముఖ్య కారణం శ్రీసత్య. అర్జున్ తో ఆమె మాట్లాడుతూ ‘ఎవరు ఎమన్నా పట్టించుకోవా అసలు..నువ్వు మనిషివేనా’ అంటూ శ్రీసత్య తిడుతుంది. రేవంత్ తో ‘ఏమన్నావు నువ్వు నన్ను’ అంటూ గొడవకి పోతాడు..అలా వీళ్లిద్దరు క్యారెక్టర్స్ నుండి బయటకి వచ్చి తగువులు వేసుకోవడం తో బిగ్ బాస్ హర్ట్ అయ్యి టాస్కుని ఆపేసాడు. బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఈ టాస్క్‌లను రద్దు చేస్తున్నాం.. ఈ షోపట్ల..
Bigg Boss 6 Telugu : ఫుల్ సీరియస్..
ప్రేక్షకుల పట్ల గౌరవం లేకపోతే.. బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోండి అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్. అయితే హౌస్‌లో ఉన్న వాళ్లందర్నీ కలిపి తిట్టడంతో.. నన్ను కాదంటే నన్ను కాదు అన్నట్టుగా ప్రవర్తించి ఎవరి పెర్ఫామెన్స్ వాళ్లు చేస్తున్నారు. శ్రీహాన్ అయితే కెమెరా దగ్గరకు వెళ్లి.. టైంకి తినాలి.. సోది ముచ్చట్లు పెట్టుకోవాలి.. ముందు వాళ్లకి బిగ్ బాస్ షో గురించి చెప్పండి బిగ్ బాస్.. మినిమమ్ క్లారిటీ లేదు.. ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుల వల్ల అందరికీ ఎఫెక్ట్ అవుతుంది’ అని పెర్ఫామెన్స్ మొదలుపెట్టాడు. ఇక బిగ్ బాస్ చెప్పింది చేయకుండా సొంతపెత్తనాలు చేసే గీతు.. శిక్షలు గురించి మాట్లాడుతుంది. ఇక్కడ కూడా కాళ్లు ఊపుతూ.. బిగ్ బాస్ అన్నది నన్ను కాదు అన్నట్టుగా ఓవరాక్షన్ చేస్తూ కనిపించింది గీతు.