TEA : టీ లో బిస్కెట్లు డిప్ చేసుకొని తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి…!!
TEA : చాలామంది ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీలు తాగకుండా ఏ పని మొదలుపెట్టారు.. టీ లో కెఫిన్ ఉండడం వలన ఒక కప్పు టీ తాగాలని శరీరంలో మంచి ఉత్సాహం వస్తుంది.. టీ తాగగానే చాలామంది ఎంతో యాక్టివ్ గా పని చేస్తూ ఉంటారు.. వర్షం పడుతుండగా చాలామంది టీ తాగుతూ కొన్ని రకాల స్నాక్స్ తో తినడనాకి ఎంతో ఇష్టపడతారు. అయితే అలాంటి టీలో చాలామంది స్నాక్స్ బిస్కెట్స్ తింటూ ఉంటారు.. టీలో బిస్కెట్ ని డీప్ చేసుకొని తింటే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. బిస్కెట్స్ తో పాటు టీ తీసుకోవడం చాలా మందికి అలవాటు.
కానీ టీతో బిస్కెట్స్ తినడం వల్ల శారీరక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బిస్కెట్లులో హైడ్రోజన్ కొవ్వు అధికంగా ఉంటుంది. టితోపాటు బిస్కెట్స్ తీసుకుంటే ఊబకాయం, చర్మ సమస్యలు వస్తాయి. మీరు టితోపాటు ఎక్కువ బిస్కెట్స్ ని తీసుకున్నట్లయితే అది మీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. ఇందులో సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు థైరాయిడ్ సమస్య ఉన్నవారు బిస్కెట్లు తినకూడదు. సాధారణంగా షుగర్ ఫుడ్ స్లోగా నిరోధక శక్తిని బలహీన పరుస్తాయి. బిస్కెట్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ఎక్కువ బిస్కెట్స్ ని టీతోపాటు తీసుకుంటే లోక నిరోధక శక్తి తగ్గిపోతుంది. రక్తంలో చక్కెర లెవెల్స్ పెరుగుతాయి. రక్తపు సిరల్లో ఇన్సులిన్ ఒత్తిడి కూడా అధికమవుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు టీతోపాటు బిస్కెట్స్ తినడం మానుకుంటే మంచిది. టీతోపాటు కొన్ని రకాల బిస్కెట్స్ ని తినడం వలన గ్యాస్, అలర్జీ, అలాగే బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. చర్మంపై ముడతలు త్వరగా వస్తాయి. అలాగే నోట్లో బ్యాక్టీరియా లాంటి ఎన్నో వ్యాధులు వస్తాయి. దంతాల్లో నొప్పి, దంతాలు రంగు మారడం ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఈ అలవాటు మానేయడం మంచిది.