Black Gram : నల్లగా ఉన్నాయని చీప్ గా చూడకండి.. ఇవి ఉక్కుతో సమానం.. ఎలాంటి సమస్యలకైనా చెక్ పెడతాయి…!
ప్రధానాంశాలు:
Black Gram : నల్లగా ఉన్నాయని చీప్ గా చూడకండి.. ఇవి ఉక్కుతో సమానం.. ఎలాంటి సమస్యలకైనా చెక్ పెడతాయి...!
Black Gram : చాలామంది జీవనశైలి విధానంలో కొన్ని ఆహార మార్పుల వలన ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.. అయితే సమస్యలు లేకుండా మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం సరైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్యంవంతంగా ఉండడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అందులో మినుములు కూడా ఒకటి. మినుములు తీసుకుంటే మన శరీరం ఉక్కులా తయారవుతుంది మినుముల్లోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ మినుముల్లో పొటాషియం, ఫైబర్, మంచి కొవ్వుతో పాటు విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ బి వన్, బి త్రీ తో పాటు మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం లాంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన చర్మ ఆరోగ్యాన్ని జీవక్రియను మెరుగుపరుస్తాయి. వీటితోపాటు ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం..
గుండె ఆరోగ్యానికి మేలు: మినుముల్లో పొటాషియం, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులను నివారించడానికి ఉపయోగపడతాయి. రక్తంలో వెలువడే చక్కెర ,చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. రక్తపోటును కంట్రోల్ చేస్తాయి..
షుగర్: మినుముల్లో ఉండే పోషకాలు ఆరోగ్యవంతంగా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. గ్లూకోజ్ లెవెల్స్ ను కంట్రోల్ చేసి షుగర్ సమస్య లేకుండా చేస్తాయి. రక్తహీనత ను దూరం చేస్తాయి..
జీర్ణ క్రియ: మినుములు రోజు తీసుకోవడం వలన జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. మినుముల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఉబ్బసం, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఉదర సమస్యలుకు చెక్: మినుముల్లో ఉండే ఆంటీ ఇంప్లిమెంటరీ గుణాలు కడుపులో వచ్చే మంటను తగ్గిస్తాయి. అలాగే నొప్పులతో, గాయాలతో ఇబ్బంది పడుతున్న వారికి మినుములతో తయారుచేసిన ఆహారం తీసుకోవాలి.
ఎముకలు దృఢంగా మారుతాయి: మినుముల్లో ఉండే భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు దృఢంగా మారడానికి ఉపయోగపడతాయి. ఎముకలు విరిగినవారు ఆర్థరైటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు మినుములను నిత్యం తీసుకుంటే ఆ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది..