Covaxin Booster Dose : కొవాగ్జిన్ బూస్టర్ డోస్ తో అద్భుతమైన ఫలితాలు.. వెల్లడించిన భారత్ బయోటిక్..!
Covaxin Booster Dose : మళ్లీ దేశంలో కరోనా కోరలు చాస్తున్న సమయంలో గుడ్ న్యూస్ వచ్చింది. బూస్టర్ డోస్ తో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇది వేసుకున్న వారిలో 90శాతం ఫలితాలు వస్తున్నట్టు చెబుతున్నారు. గత పది రోజులుగా కేసులు విపరీతంగా వస్తున్నాయి. 10 వేల నుండి ఏకంగా లక్షన్నర దాకా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజల్లో థర్డ్ వేవ్ భయం విపరీతంగా పెరిగిపోయింది.
అయితే వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా రావడం ఆందోళన కరంగా మారింది. ఇక కొత్తగా ఒమిక్రాన్ కూడా బాగానే కోరాలు చాస్తోంది. దీని కేసులు కూడా బాగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండో టీకా తీసుకున్న బూస్టర్ డోస్ వేయాలని మోడీ నిర్ణయించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ బూస్టర్ డోస్ మీద శుభవార్త వినిపించింది.

Booster Dose amazing results with Covaxin booster Dose revealed by bharat biotic
బూస్టర్ డోస్ తో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని వెల్లడించింది. బూస్టర్ డోసు వేసిన వారిలో యాంటీబాడీల సంఖ్య 19 నుండి 265 రెట్ల వరకు పెరిగిపోయినట్టు వెల్లడించింది. త్వరలోనే అందరికీ బూస్టర్ డోస్‌ను వేసేందుకు మార్గం సుగుమం అయిందని తెలిపారు.