Health Benefits : సమ్మర్ లో సొరాకాయ తిన్నారంటే.. ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టొచ్చు!
Health Benefits : సొరకాయలో విటామిన్ సి, సోడియం, పైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. సొరకాయ చాలా మందికి ఇష్టం ఉండదు. అలాగే తినడానికి కూడా అంతగా ఇష్టపడరు. కానీ దీన్ని తినడం వల్ల కల్గే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం వారంలో ఒక్కసారైనా కచ్చితంగా తింటారు. సొరకాయ చల్లదనాన్ని కల్గించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కావున మీరు ప్రతి సీజన్ లో వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రస్తుతం వేసవి కాలంలో సొరకాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. దీంతో పాటు ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. మీరు సొరకాయను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. అది కూడా చాలా మార్గాల్లో సొరకాయను వండుకోవచ్చు. అయితే సొరకాయ వల్ల కల్గే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం.
సొరకాయ కేకులు, సొరకాయ రైతా, సొరకాయ ప్లెయిన్ వెజిటబుల్, సొరకాయ గోర్డ్ వెజిటబుల్, సొరకాయ, సెనగలు మిక్స్ డ్ వెజిటబుల్ రూపంలో కూడా తినవచ్చు. అయితే వేసవిలో సొరకాయ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. ఇది వేడిని ఎదుర్కోవడంలో శరీరానికి సాయపడుతుంది. సొరకాయను క్రమం తప్పకుండా తినడం వల్ల ఒత్తిడి, మానసిక సమస్యల నుంచి అపశమనం లభిస్తుంది. అలాగే సొరకాయ మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఔషదంగా పని చేస్తుంది. ఇది చక్కెరను నియంత్రించడంలో సాయపడుతుంది. అలాగే జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణం, మల బద్ధకం, గ్యాస్ మొదలైన సమస్యలు దూరం అవుతాయి. దీన్ని తినడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ ఆహారం పూర్తిగా శరీరానికి అందుతుంది.
అనపకాయలో ఐరన్ చాలా మంచి మొత్తంలో ఉంటుంది. కావున ఇది శరీరంలో హెమోగ్లోబిన్ పెంచడానికి తోడ్పడుతుంది. సొరకాయ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు సహజంగా లభిస్తాయి. ఇది ఎముకలకు బలోపేతం చేస్తుంది. లూజ్ మోషన్ లాంటి సమస్యతో బాధపడుతుంటే… పెరుగు లేదా మజ్జిగతో పొట్లకాయ రైతా తింటే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే వేడి, మైకం నుంచి ఉపశమనం పొందవచ్చు, శీరరంలో నీరు లేకపోవడాన్ని నియంత్రిస్తుంది. వడ దెబ్బ తగలకుండా చేసింది. లూజ్ మోషన్ సమస్యను నివారిస్తుంది. వేడి కారణంగా శ్వాస ఆడకపోవడం, అలసట, ఒత్తిడిని దూరం చేస్తుంది.