Butterfly Pea Flower Tea : ఈ పూలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదలరు…??
Butterfly Pea Flower Tea : శంకు పూలను అపరాజిత పూలు అని కూడా పిలుస్తారు. అలాగే ఆయుర్వేద ప్రకారం ఈ పూలకు ఎంతో ప్రాముఖ్యత కూడా ఉన్నది. ఈ పూలను ఆయుర్వేదంలో ఒక ఔషధంగా చెబుతారు. ఈ శంకుపూలలో ఉండే ఎంతో శక్తివంతమైన నీలం రంగు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ శంఖం పూలాల్లో యాంటీ గ్లెకేషన్ […]
ప్రధానాంశాలు:
Butterfly Pea Flower Tea : ఈ పూలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే... అస్సలు వదలరు...??
Butterfly Pea Flower Tea : శంకు పూలను అపరాజిత పూలు అని కూడా పిలుస్తారు. అలాగే ఆయుర్వేద ప్రకారం ఈ పూలకు ఎంతో ప్రాముఖ్యత కూడా ఉన్నది. ఈ పూలను ఆయుర్వేదంలో ఒక ఔషధంగా చెబుతారు. ఈ శంకుపూలలో ఉండే ఎంతో శక్తివంతమైన నీలం రంగు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వలన చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ శంఖం పూలాల్లో యాంటీ గ్లెకేషన్ క్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అంతేకాక ఇవి ఏజింగ్ లక్షణాలు రాకుండా అడ్డుకుంటుంది. ఈ శంఖం పూల యొక్క టీ ని ప్రతిరోజు తాగడం వలన చర్మంలో కొల్లజెన్ ఉత్పత్తి అనేది బాగా పెరుగుతుంది. దీని వలన ముఖంపై ముడతలు మరియు గీతలు అనేవి పడవు. అలాగే ఈ శంఖం పూలలో యాంటీ ఇన్ప్లమెంటరీ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మన్ని అలర్జీ నుండి రక్షిస్తుంది.
శంఖం పూలాల్లో ఎంతో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు ప్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే దీనిలో ఉన్న యాంటీ యాక్సిడెంట్లు అనేవి బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఈ పూలతో టీ చేసుకుని తాగటం వలన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అలాగే ఈ పూలలో విటమిన్ ఏ సి ఈ కేలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మంపై పొరను రక్షించటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే శంఖం పూలతో తయారు చేసిన టీ ని తాగటం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లో మీకు మంచి మార్పు కనిపిస్తుంది…
దీని కోసం శంఖం పూలను బాగా ఎండబెట్టి వాటిని గాలి చేరని సీసాలో పెట్టాలి. ఇప్పుడు మీకు టీ తాగాలి అనిపించినప్పుడు దానిలో నుండి మూడు లేక నాలుగు ఎండిన పూలను తీసుకొని నీటిలో వేసి బాగా మరిగించాలి. దీంతో ఆ నీరంతా నీలం రంగులో కి మారుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి వడకట్టుకొని దానిలో కొద్దిగా తేనే వేసుకొని తాగాలి. అంతేకాక ఈ పూలతో హెయిర్ మాస్క్ మరియు ఫేస్ మాస్క్ లు తయారు చేసుకుని వాడితే మంచి ఫలితం ఉంటుంది