Diabetics : షుగర్ ఉన్నవాళ్లు పుచ్చకాయ తింటే మీ శరీరంలో జరిగేది ఇదే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetics : షుగర్ ఉన్నవాళ్లు పుచ్చకాయ తింటే మీ శరీరంలో జరిగేది ఇదే…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :16 March 2023,3:00 pm

Diabetics : ఫ్రూట్స్ అంటే మరో మాట లేకుండా అన్ని రకాల పండ్లను చక్కగా ఆరగిస్తారు. అది కూడా సమ్మర్ ఫ్రూట్స్ అంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఈ ఫ్రూట్స్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యంతో పాటు శరీరం డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడతాయి. అయితే ఈ పుచ్చకాయ అందరూ తినొచ్చా పుచ్చకాయ వల్ల లాభాలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉంటాయా..? పుచ్చకాయ ఎవరు తినకూడదు అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్రపంచంలోనే చాలా ప్రాంతాల్లో పెరిగే పండ్లలాగే పుచ్చకాయ కూడా విరివిగాని పండుతుంది. మన ప్రాంతంలో కూడా పుచ్చకాయ లో క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అధిక బరువు ఉన్నవాళ్లు కూడా చక్కగా తినొచ్చు. ఇక డైటింగ్ చేసే వాళ్ళకి పుచ్చకాయ వరం అని చెప్పాలి.

ఎందుకంటే ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు తింటే కడుపు అంతా నిండిపోతుంది. పైగా ఆకలి తీరిపోతుంది. తొందరగా ఆకలి కూడా వేయదు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో నీటి శాతం ఎక్కువ కాబట్టి మన శరీరాన్ని చాలా చక్కగా శుద్ధి చేస్తుంది. అలాగే అధికంగా పేర్కొన్న కొవ్వును కూడా శుద్ధి చేయడంలో పుచ్చకాయ బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ పుచ్చకాయలు కేవలం లోపలి గుజ్జు మాత్రమే కాకుండా తొక్క గింజలు ఈ మూడు కూడా తినడానికి ఉపయోగపడేది. ఎండాకాలం పుచ్చకాయ తింటే ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. కదా దీని కారణం ఈ కాయ 92% నీటితో నిండి ఉండడమే అంతే కాకుండా పుచ్చకాయలో మనకి క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం అలాగే విటమిన్ ఏ బి వన్ బి టు బి 6 డి లైకోపీ పోషకాలు ఉంటాయి. అలసిపోయిన మన శరీరాన్ని తిరిగి ఫ్రెష్ గా కూల్ గా మార్చేస్తుంది.

Can Diabetic Patients Eat Watermelon

Can Diabetic Patients Eat Watermelon

పుచ్చకాయ అయితే చల్లగా ఉందని ఎండ తాపాన్ని తగ్గిస్తుందని పుచ్చకాయను అదేపనిగా తినేయకండి. ఈ పుచ్చకాయ తినేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత మోతాదులో తీసుకోవాలి.. షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చా.? అనే విషయాలు పూర్తిగా తెలుసుకోవడం మంచిది. ముందుగా పుచ్చకాయ తినడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం.. రక్త పోటు గుండెపోటును పుచ్చకాయ తగ్గిస్తుంది. క్యాన్సర్ వ్యాధిని కూడా తగ్గించే లక్షణాలు పుచ్చకాయలో ఉన్నట్లు పరిశోధనలో తేలింది. అలాగే ప్రెగ్నెన్సీ తో ఉన్న మహిళలు పుచ్చకాయ తింటే పుట్టే బిడ్డ చాలా ఆరోగ్యంగా పుడతాడు. కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా పుచ్చకాయ ముక్కల్లో కొంచెం తేనె వేసుకుని తింటే సమస్య తీవ్రత తగ్గుతుంది. ఇక మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి పుచ్చకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఎందుకంటే పుచ్చకాయ మీ పొట్టను శుభ్రంగా నీటితో నింపేస్తుంది. కాబట్టి చక్కగా మోషన్ ఫ్రీ అవుతుంది.

కడుపు శుభ్రమైపోతుంది. పేగులు కూడా శుభ్రమైపోతాయి. దీంతో అరుగుదల శక్తి కూడా మెరుగవుతుంది. ఇక కామెర్లు, పైత్యం, వికారం, తలనొప్పి నోరు తడారిపోవడం అంటే సమస్యలకు పుచ్చకాయ మంచి ఎంపిక.. కడుపుబ్బరం కడుపునొప్పి విరోచనాలతో బాధపడే వాళ్ళు కూడా పుచ్చకాయ ముక్కలు తింటే ఉపశమనం కలుగుతుంది. అయితే మనం ఎప్పుడైనా ప్రయాణంలో ఉన్నప్పుడు లేకపోతే పని మీద బయటకు వెళ్ళినప్పుడు పుచ్చకాయ కొనుక్కోవాలని ఆగుతాం.. అయితే ఆ టైంలో కాయంత కొనే పరిస్థితి కాదు. అలాంటప్పుడు కట్ చేసిన ముక్కల్ని కొనుక్కుని తింటాం. అయితే అవి ఐస్ మీద పెట్టి అమ్ముతుంటారు. కొనుక్కొని తినొచ్చు అయితే పుచ్చకాయను కొనేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రెండ్స్ అది పైకి మనకి ఆకుపచ్చగా కనిపిస్తుంది.

Is watermelon high in sugar for diabetes? Diet tips and nutrition

కోస్తే తప్ప లోపల ఎర్రగా ఉందో లేదో కూడా మనకు అంతగా తెలియదు.. అయితే అలా మనం టెస్ట్ చేసే క్రమంలో కోసి కనుక మనం ఇంటికి తీసుకెళ్తే త్వరగా పాడే అవకాశాలు ఉంటాయి. దీనితో కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. పుచ్చకాయ అధికంగా తీసుకుంటే మన శరీరంలో పొటాషియం కొంతమందికి క్యారెట్ తింటే శరీరానికి పడదు. ఎనర్జీ వస్తుంది. అలాగే పుచ్చకాయ కూడా కొంతమందికి పడదు ఇటువంటి దుష్ప్రభావాలు ఏమీ ఉండకూడదు అనుకుంటే రోజులో 400 గ్రాములు లేదా 500 గ్రాముల వరకు మాత్రమే పుచ్చకాయలు తీసుకోవచ్చు. ఇక షుగర్ పేషెంట్స్ రాత్రిపూట భోజనం మానేసి కేవలం పళ్ళను మాత్రమే తీసుకుంటారు అలాగే వేసవిలో పుచ్చకాయను అధికంగా తీసుకోవడానికి ఇష్టపడతారు.

అలా పుచ్చకాయని మీ లైట్ డిన్నర్ లో కనుక తీసుకుంటూ ఉంటే కొన్ని జాగ్రత్తలు అయితే పాటించండి. మీరు తీసుకునే పుచ్చకాయ ఎరుపు రంగులో ఉంటుంది కదా ఆ ఎరుపు రంగుని ఆనూకుని ఉండే తెల్లని రంగుతో ఉండే పొర ఉంటుంది కదా ఆ లేయర్ కూడా మీరు తినడానికి ప్రయత్నం చేయాలి. ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల పెరిగే షుగర్ లెవెల్స్ ని ఈ వైట్ పార్ట్ అదుపులో ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే వాటర్ మిలన్ ని యధావిధిగా పండు రూపంలో మాత్రమే తీసుకుంటే ఆరోగ్య ప్ర యోజనాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా మిక్సీలో వేసి జ్యూస్ లా చేసుకుని తాగితే అంత ఎక్కువ ప్రయోజనాలు అయితే ఉండవు. పుచ్చకాయలో చక్కగా పీచు పదార్థం ఉంటుంది. అది మనం నమిలి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది