Capsicum : క్యాప్సికమ్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా…!
Capsicum : క్యాప్సికమ్ ను తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. అలాగే వీటి వలన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు కూడా లభిస్తాయి అని అంటున్నారు. అలాగే శరీరానికి ఎంతో అవసరమయ్యే విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. అంతేకాక దీనిలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. కావున దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కూడా రక్షిస్తుంది. దీనిని తీసుకోవటం వలన కలిగే లాభాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
క్యాప్సికమ్ లో విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇది శరీరం లో ఐరన్ లోపాన్ని కూడా నియంత్రిస్తుంది. అంతేకాక రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గేందుకు కూడా ఇది ఎంతో చక్కగా పనిచేస్తుంది. వీటిలో ఊబకాయాన్ని కరిగించే పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాక దీనిలో ఉండే ఫైబర్ కూడా జీర్ణక్రియ కు ఎంతో మేలు చేస్తుంది. అలాగే మలబద్ధకం మరియు అజీర్ణం లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది. ఇవి మాత్రమే కాక కంటి ఆరోగ్యానికి కూడా బాగా పని చేస్తుంది. అయితే వీటిలో లుటిన్ మరియు జియాక్సితిన్ లాంటి పోషకాలు కూడా ఉన్నాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. అలాగే కంటి చూపును మెరుగుపరచటమే కాకుండా ఎన్నో రకాల కంటి సమస్యలను కూడా నయం చేయగలదు. వీటితో పాటు రే చీకటి లాంటి సమస్యలు కూడా రాకుండా చూస్తుంది.
ఈ క్యాప్సికమ్ కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే గుండె జబ్బులతో పాటు ఇతర సమస్యలను కూడా నియంత్రిస్తుంది. అందుకే క్యాప్సికమ్ లు తమ ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఎంతగానో రక్షిస్తాయి. అలాగే చర్మంపై ముడతలు మరియు మచ్చలు కూడా రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది అని అంటున్నారు ని నిపుణులు. అలాగే ఇది చర్మాని ఎన్నో సమస్యల నుండి కూడా రక్షిస్తుంది. ఈ క్యాప్సికమ్ అనేది చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా పని చేస్తుంది. దీనిలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఇవి పంగల్ ఇన్ఫెక్షన్స్ మరియు బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్ ను తగ్గించడంలో కూడా బాగా పని చేస్తాయి. ఈ క్యాప్సికమ్ లో ఉండే గుణాలు కీళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయి. అలాగే దీనిలో ఉండే క్యాప్సిసిన్ యూరిక్ యాసిడ్ ను కూడా తగ్గించేందుకు ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక ఎన్నో రకాల సమస్యలను కూడా తగ్గించేందుకు ఈ క్యాప్సికమ్ కీలక పాత్ర పోషిస్తుంది…